close
Choose your channels

‘కేజీఎఫ్ 2’ కోసం సిద్ధమవుతున్న సంజయ్ దత్..

Friday, October 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘కేజీఎఫ్ 2’ కోసం సిద్ధమవుతున్న సంజయ్ దత్..

బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ కోసం సంజయ్ దత్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం సంజయ్ గడ్డం పెంచారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్స్‌లో తిరిగి పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ‘కేజీఎఫ్‌ 2’ షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభమవుతుందని సంజయ్‌దత్‌ చెప్పారు. ఆ సినిమా కోసం గడ్డం పెంచుతున్నట్లు తెలిపారు.

కొంతకాలంగా కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఎయిర్‌పోర్టులో ఓ అభిమానికి ఆయన కనిపించడంతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ పిక్‌లో ఆయన చాలా బలహీనంగా కనిపించారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ నెటిజన్లు, సంజయ్ దత్ అభిమానులు ట్వీట్లు పెట్టారు. కాగా.. తాజాగా సంజయ్ దత్.. న్యూ లుక్‌ కోసం హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ దగ్గరకు వెళ్లిన సందర్భంగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఆగస్టులో సంజయ్ మాట్లాడుతూ.. తనకు త్వరలో కరోనాను జయిస్తాననే నమ్మకం ఉందన్నారు. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నానని వెల్లడించారు. తన ఆరోగ్యం విషయంలో వర్రీ అవసరం లేదని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ప్రకటించారు. అయితే తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని మాత్రం సంజయ్ వెల్లడించలేదు. కొంత కాలంగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఉన్న సంజయ్ దత్.. ఇటీవలే షూటింగ్స్ కోసం ముంబైకి తిరిగి వచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.