Jabardasth: అందుకే జబర్దస్త్‌ను వీడాల్సి వచ్చింది.. సింగర్ మనో సంచలన వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


జబర్దస్త్.. ఈ షో గురించి తెలుగు నాట తెలియని వారుండరు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఇంటిల్లిపాదిని నవ్వించే ఈ ప్రోగ్రామ్ కోసం తెలుగువారు ఆతృతగా ఎదురుచూస్తారు. పదేళ్లు గడుస్తున్నా జబర్దస్త్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పించి.. వారు జీవితంలో మరింత స్థిరపడేందుకు అవకాశం కల్పించింది ఈ షో. తిరుగులేని టీఆర్పీతో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సత్తా చాటింది జబర్దస్త్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు జబర్దస్త్ మునుపటి స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోతోంది. పాత వారు సినిమాలు, ఇతర టీవీ ఛానెల్స్‌లో అవకాశాలు రావడంతో జబర్దస్త్‌ను వీడారు. కొత్త వారు వస్తున్నా గతంలో మాదిరిగా రక్తి కట్టించలేకపోతున్నారు.
రోజా-నాగబాబు రేంజ్‌లో సెట్ అవ్వని జడ్జిలు :
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జడ్జిల గురించే . జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుంచి ఏళ్ల పాటు నాగబాబు, రోజాల జోడి జడ్జిలుగా వ్యవహరించి.. షోకు అదనపు ఆకర్షణగా నిలిచారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నాగబాబు తప్పుకోవడంతో ఆయన ప్లేస్‌లో అలీ, పోసాని కృష్ణ మురళీ, మనో, కృష్ణ భగవాన్, జానీ మాస్టర్ వంటి వారు జడ్జిగా వ్యవహరించారు. అయితే రోజా మాత్రం కొనసాగారు. కానీ ఆమెకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కడంతో రోజా కూడా జబర్దస్త్‌ను వీడాల్సి వచ్చింది. దీంతో మధ్యలో మీనా, ఆమని, సంఘవి, ఇప్పుడు ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరించారు. ఎంతమంది వచ్చినా రోజా-నాగబాబు రేంజ్‌లో అలరించలేకపోయారు.
మనో జబర్దస్త్‌ను వీడటంపై రకరకాల గాసిప్స్ :
ఇదిలావుండగా.. కొద్దినెలల పాటు జడ్జిగా వ్యవహరించిన మనో తప్పుకోవడం అప్పట్లో కలకలం రేపింది. హుషారుగా వుంటూ పంచ్‌లతో అలరించే మనో షోను బాగానే నడిపించారు. అయితే ఆయన వైదొలగడం మైనస్‌గా మారింది. మల్లెమాలతో గొడవలు జరిగాయని అందుకే మనో తప్పుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్‌ను వీడటంపై స్పందించారు మనో. ఈ షోకు తాను తాత్కాలికంగానే బ్రేక్ ఇచ్చానని.. త్వరలోనే మళ్లీ ఎంట్రీ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా తాను ఒప్పుకున్న కొన్ని షోలు పెండింగ్‌లో వున్నాయని.. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి వారితో కలిసి కొన్ని షోలు చేయాల్సి వుందన్నారు. వీటిని పూర్తి చేయడానికే జబర్దస్త్‌కి గ్యాప్ ఇచ్చానని.. అంతేకానీ మరో కారణం లేదని రూమర్స్‌కి చెక్ పెట్టారు మనో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.