close
Choose your channels

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

Thursday, November 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను హీరోయిన్ కాకుండా మ‌రో హీరోయిన్‌తో చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు.

అయితే రామ్‌చ‌ర‌ణ్ త‌దుప‌రి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే `ఆర్ ఆర్ ఆర్‌` సినిమాతో బిజీ కానున్నారు. ఈ న‌వంబ‌ర్ 19 నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతుంది. కాబ‌ట్టి ఆలోపు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని బోయ‌పాటి భావిస్తున్నాడ‌ట‌. అందుక‌నే ఆ స్పెష‌ల్ సాంగ్‌ను కూడా రామ్‌చ‌ర‌ణ్‌, కియరా అద్వానిల‌పైనే చిత్రీక‌రించబోతున్నార‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.