close
Choose your channels

సూర్య 38వ చిత్రానికి ప్రారంభమైన మ్యూజిక్ సిట్టింగ్స్

Thursday, May 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య 38వ చిత్రానికి ప్రారంభమైన మ్యూజిక్ సిట్టింగ్స్

తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ‘ఎన్జీకే’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న‌ విషయం తెలిసిందే. సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సూర్య కెరీర్‌లో 36వ చిత్రం కావ‌డం విశేషం. ఈ సినిమా పూర్త‌య్యేలోపే.. కె.వి.ఆనంద్ డైరెక్షన్లో ఓ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించునున్నారు సూర్య‌. గతంలో వీరిద్దరి కలయికలో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నుండ‌డంతో.. ఇప్ప‌టికే ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. తెలుగులో వెంకటేష్ నటించిన ‘గురు’ (తమిళంలో ‘ఇరుది సుట్రు’) సినిమాని తెరకెక్కించిన సుధ కొంగర డైరెక్షన్లో సూర్య త‌న 38వ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ పిరియాడిక్ ఎంటర్‌టైనర్‌కి త‌మిళ యువ‌ సంగీత‌ సంచ‌ల‌నం జి.వి.ప్రకాష్ సంగీతం అందించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్ప‌టికే చెన్నైలో మ్యూజిక్ కంపోజింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన‌ మరిన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.