close
Choose your channels

వామ్మో.. ఈ నర్స్ మేడమ్ టూ హాట్ గురూ..!

Thursday, May 21, 2020 • తెలుగు Comments

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తు్న్నారు. రాత్రనక పగలనక వారు సేవలందిస్తున్నారు. కరోనాకు తమకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ఎప్పటికీ మరిచిపోలేం.. అందుకే వారిని మర్యాదగా ఉంటూ గౌరవించాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉంది. మరోవైపు కరోనా రోగుల్లో కొత్త ఉత్సాహం రావడానికి.. కరోనా అనే ఫీలింగ్ నుంచి బయటపడటానికి పలువురు నర్సులు డ్యాన్స్‌లు చేస్తూ వినూత్న ప్రయోగాలు సైతం చేస్తున్నారు.

ఇదీ అసలు విషయం..
అయితే.. తాజాగా ఓ నర్సు చేసిన పనికి విషయం తెలుసుకున్న జనాలు, కరోనా రోగులు, అనుమానితులు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ నర్సు అంతలా ఏం చేసిందబ్బా అనే సందేహం కలుగుతోంది కదూ.. ఇదిగో ఒకసారి పక్కనున్న ఫొటో వైపు ఓ లుక్కేయండి. చూశారుగా.. అదీ పరిస్థితి. అయితే ఇలా నర్సు హాట్ హాట్‌గా కనినిపంచడానికి చాలా కారణాలే ఉన్నాయ్. ఈ వింత ఘటన రష్యాలోని తులా ప్రాంతంలో ఉన్న రీజినల్ క్లినికల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మేడమ్ గారు ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం పెద్దగా అబ్జక్షన్ చెప్పలేదు కానీ.. ఇలా లోదుస్తులపైనే పీపీఈ సూట్ ధరించడం.. లోపలున్న పార్ట్స్ అన్నీ బయటికి కనిపిస్తుండటంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆరోగ్య శాఖ వివరణ కోరింది. మీరు డ్రెస్ కోడ్ ఉల్లఘించారు.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా ఆమె చెప్పిన కారణాలు విన్న ఆరోగ్య శాఖ ఆశ్చర్యపోయింది.

అందుకే ఇలా చేస్తున్నా..!
‘పీపీఈ సూట్లు ధరిస్తుంటే చాలా వేడిగా ఉంటోంది. వేడిని తట్టుకోలేక లోదుస్తుల పైనే పీపీఈ సూట్ ధరిస్తున్నాను. ఆస్పత్రి యాజమాన్యం నాకు ఇచ్చిన పీపీఈ సూట్స్ పారదర్శకంగా ఉండటం వల్ల నా లోదుస్తులు బయటకు కనిపిస్తున్నాయి. ఇందులో నా తప్పు ఏముంది..?. పైగా నేను ధరించినవి లోదుస్తులు కాదు.. టూ పీస్ బికినీ’ అని ఆరోగ్యశాఖకు వివరణ ఇచ్చుకుంది. ఈ కారణాలు విన్న ఆరోగ్య శాఖ విస్తుపోయింది.

వెంటనే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆ హాట్ నర్సుపై ఏం చర్యలు తీసుకున్నారు..? ఇంతకీ ఆ నర్సుకు ఉద్యోగం ఉందా..? ఊడిందా.? అన్నది మాత్రం ఇంతవరకూ తెలియలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆమె వివరణకు చాలా మంది మద్దతిస్తుండగా.. మరికొందరు ఇదేంటిది..? అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకొదరైతే ఆమె హాట్‌నెస్‌ను చూసి కరోనా రోగులు కోలుకుంటారు.. మీరు కంటిన్యూ చేస్కోండి.. మీకు మేమున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz