close
Choose your channels

22 జులై 11.05 నిమిషాలు జిఏ2 పిక్చ‌ర్స్ 'గీత‌గోవిందం' టీజ‌ర్ రిలీజ్‌

Saturday, July 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

22 జులై 11.05 నిమిషాలు జిఏ2 పిక్చ‌ర్స్ గీత‌గోవిందం టీజ‌ర్ రిలీజ్‌

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం. "గీత గోవిందం మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేసిన ద‌గ్గ‌ర‌నుండి విప‌రీతంగా వైర‌ల్ అవుతూ తెలంగాణా, ఆంద్రా లోనే కాకుండా ప్ర‌పంచంలో వున్న తెలుగు వారంతా మెబైల్స్ లో, సావ‌న్‌, వింక్‌, ఆదిత్యా, గానా లాంటి ఫెమ‌స్ యాప్స్ లో విన‌ట‌మేకాకుండా హ్యూజ్ గా డబ్‌స్మాష్ లు వాట్స‌ప్, ఫేస్‌బుక్ స్టేట‌స్ లుగా పెట్టుకుని సుమారు కొటి వ్యూస్ ని సాధించి ఇంకేమి కావాలి ఇంకేమి కావాలి అంటూ ఇంకా ముందుకు దూసుకుపోతుంది. ఇదిలా వుంటే గీతా గోవిందం చిత్రం టీజ‌ర్ ని 22 జులై 11.05 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ ఈ చిత్రానికి ఎక్స‌లెంట్ మ్యూజిక్ ని అందించారనేది అర్ధ‌మవుతుంది. అలాగే టీజ‌ర్ కి కూడా సూప‌ర్బ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

అన్ని కార్య‌క్రమాలు పూర్తిచేసి అగ‌ష్టు 15న ఈ చిత్రం విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.. ఈ టీజ‌ర్ కొసం ఇప్ప‌టికే గూగుల్‌, యూట్యూబ్ లో సెర్చ్ ఇంజ‌న్ స్టార్ట‌వ్వ‌టం ఈ చిత్రంపై వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందుతున్న ఈ చిత్రానికి మ‌ణికంద‌న్ చ‌క్క‌టి కెమెరా ప‌నితనం అందించారు. ఆర్ట్ ర‌మ‌ణ వంక, ఎడిట‌ర్ మార్తాండ్ కె వెంక‌టేష్ చ‌క్క‌టి ప‌నితీరుని చూపించారు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం హైలెట్ గా నిలుస్తుంది. ఇదిలా వుంటే క్రేజి హీరో విజ‌య్‌దేవ‌ర కొండ‌, క్రేజి హీరోయిన్ ర‌ష్మిక పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా అందంగా వుండ‌టం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.