close
Choose your channels

మహిళలూ.. మీ భర్తలతో హాయిగా యాత్రలకెళ్లండి!

Sunday, May 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహిళలూ.. మీ భర్తలతో హాయిగా యాత్రలకెళ్లండి!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి దెబ్బకు సైకిల్.. గ్లాస్ అడ్రస్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ దుందుభి మోగించింది. అయితే అసలు ఇదెలా సాధ్యం.. ? టీడీపీ, జనసేన పార్టీలు ఎక్కడ అట్టర్ ప్లాప్ అయ్యాయి..? అని ఆయా పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. జనసేన తరఫున రెండు స్థానాల్లో అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. రెండు చోట్ల ప్లాప్ షో పడటం.. మరోవైపు నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేసిన నాగబాబు షో ప్లాప్ అవ్వడంతో నేతలు ఆలోచనలో పడ్డారు.

ప్రజల్లో నమ్మకం కలగాలి..!

అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ‘మై చానెల్.. నా ఇష్టం’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారంటూ జగన్‌కు శుభాభినందనలు చెబుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. "వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలు అద్భుతమైన మెజారిటీ అందించారు. అందుకే జగన్ ప్రజలకు రుణపడి ఉంటారు. ప్రధానంగా తన నవరత్నాల కాన్సెప్ట్‌ను జగన్ ఈ ఐదేళ్లలో చేసి చూపించాల్సి ఉంటుంది.. ప్రజల్లో ఆ నమ్మకం కలిగించాలి. ఏపీలో జగన్ సుపరిపాలన అందించే క్రమంలో మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని నాగబాబు చెప్పుకొచ్చారు.

మీ భర్తలతో విహార యాత్రలకు..!

"ఎన్నికల్లో జనసైనికులు, వీర మహిళలు ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. జనసేన ఓటమి పట్ల బాధపడటం లేదంటే అది అబద్ధం అవుతుంది.. నిజంగానే ఎంతో మనస్తాపం చెందాము. జనసేన వీరమహిళలు బాధపడడం చూసి మాకు ఎంతో విచారం కలిగింది. కానీ ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదు... ఇదో విరామం మాత్రమే. వీర మహిళలు ఓ నెలపాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రజాసేవకు సిద్ధం కావాలి. మీ భర్తలతో కలిసి హాయిగా విహారయాత్రలకు వెళ్లి రావాలి. ఈ లోపు జనసేనాని కార్యాచరణ రూపొందిస్తాడు" అని నాగబాబు చెప్పారు. కాగా ఈ వీడియోపై పలువురు జనసేన కార్యకర్తలు, అభిమానులు కామెంట్స్ చేస్తుండా.. నెటిజన్లు, వైసీపీ, టీడీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.