మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త...
Send us your feedback to audioarticles@vaarta.com
మెట్రోలో ప్రయాణించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఏ మేరకు నష్టం చేకూరుతుందో మనం ఊహించలేం. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన గురించి ఒక్కసారి తెలుసుకోండి.. తగు జాగ్రత్తలు తీసుకోండి. అసలేం జరిగింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన గీతా (40) అనే మహిళ తన కుమార్తెతో కలిసి మెట్రోలో ప్రయాణం చేస్తోంది. ఆమె గమ్యస్థానం రావడంతో మెట్రో నుంచి దిగడానికి సిద్ధమయ్యారు. స్టేషన్ రావడంతో సీటులో కూర్చోనున్న ఆమె డోర్ దగ్గరికి వచ్చి దిగబోయింది. దిగే సమయంలో ఆమె చీర కొంగు మెట్రో డోర్ మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే అదే సమయంలో మెట్రో ట్రైన్ కదలడానికి సిద్ధమైంది. దీంతో మహిళను ట్రైన్ కాస్త ముందు వరకు లాక్కెళ్లింది. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేశారు. దీంతో మెట్రో ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది.
కాగా.. ఈ ఘటనలో గీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన కుమార్తె వైద్యం అందించింది. గీత తన కుమార్తెతో కలిసి ఢిల్లీలోని నవాడ నుంచి మోతీనగర్‌కు మెట్రోలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా గీత స్వస్థలం మోతీ నగర్‌లోని ఇండెర్లోక్‌లోని శాస్త్రి నగర్. ఇదిలా ఉంటే ఈ ఘటనతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) సీనియర్ అధికారి తన ట్విట్టర్‌లో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments