close
Choose your channels

యేసుదాసు సోదరుడు ఆత్మహత్య..!

Thursday, February 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ యేసుదాస్ సోదరుడు కెజె జస్టిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 62 ఏళ్ల వయసున్న ఆయన నిన్న కొచ్చిలోని వల్లర్పాడంలోని బ్యాక్ వాటర్స్‌లో చనిపోయారు. బుధవారం నాడు బయటికెళ్లిన జస్టిన్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బ్యాక్ వాటర్స్‌లో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెళ్లి చూడగా ఆయన జస్టిన్ అని పోలీసులు గుర్తించారు.

అయితే.. గత ఏడాదిలో తన కుమారుడు మరణించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు.. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో చేసేదేమీ లేక ప్రాణాలు విడిచేయాలని భావించి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా.. అక్కడ్నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఎందుకు చనిపోయారు..? నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా..? ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.