close
Choose your channels

జగన్ సంచలన నిర్ణయం.. షర్మిళకు కీలక బాధ్యతలు!

Wednesday, February 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో పదిరోజుల్లో ఆమెకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారా..? ఇప్పటికే పార్టీ కోసం పనిచేయాలని తహతహలాడుతున్న ఆమె కోరిక నెరవేరనుందా..? ఇప్పటి వరకూ ఆమె గురించి వచ్చిన వార్తలన్నీ నిజమవుతున్నాయా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణాంతరం, జగన్ జైలుకెళ్లిన అనంతరం రెండు సార్లు పాదయాత్ర చేసిన షర్మిళ ప్రజలకు చాలా దగ్గరయ్యారు. అప్పట్లో ‘జగనన్న వదిలిన బాణం నేను’ అని చెప్పిన ఆమె డైలాగ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వాయిస్ పర్మినెంట్‌‌గా రాజకీయాలకు అవసరమవుతోంది. షర్మిళ రాజకీయాలకు కొత్తేం కాదు.. ఎప్పట్నుంచో ఆమె రాజకీయాల్లోనే ఉన్నారు. సమయం, సందర్భాన్ని బట్టి ఆమె జనాల్లోకి వెళ్తారంతే. కాగా.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను కోస్తాఆంధ్రకు పూర్తిగా పరిమితమై.. తన చెల్లికి రాయలసీమ పార్టీ పగ్గాలు అప్పగించాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయమై ఇప్పటికే పార్టీ సీనియర్లు, సీమ నేతలతో చర్చించగా.. "వారందరూ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. షర్మిళ వస్తే మాకు మంచిదే" అని అందరూ ఒకే మాట చెప్పారట.

అయితే రాయలసీమలో కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు వైసీపీ స్ట్రాంగ్‌‌గానే ఉంది. అయితే ఒక్క అనంతపురంలోనే కాసింత వెనుకబడిందంతే. షర్మిళ రాకతో సీమలో పార్టీ మరింత బలోపేతమవుతుందని.. కచ్చితంగా అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చని జగన్ భావిస్తున్నారట. కాగా.. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతులు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. అదే ఫార్ములాను జగన్ కూడా వాడుతున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు కడప లేదా ఒంగోలు పార్లమెంట్ నుంచి షర్మిళను బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసిన అవినాశ్ రెడ్డిని బద్వేలు నియోజకవర్గానికి పంపుతారని సమాచారం. కాగా వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా సాగుతున్న ఈ పోరులో వైఎస్ షర్మిళ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..? నిజంగానే షర్మిళ రాజకీయాల్లోకి వస్తున్నారా...? ఆమె రాకతో రాయలసీమ వైసీపీలో పరిస్థితులు మారతయా..? లేకుంటే ప్లాప్ అవుతాయా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.