close
Choose your channels

విష్ణు సరసన అమైరా దస్తర్...

Thursday, March 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు విష్ణు స‌ర‌స‌న అమైరా ద‌స్త‌ర్ జ‌త క‌ట్ట‌నుంది. నిజానికి విష్ణుతో అమైరా ఈడోర‌కం-ఆడోర‌కం సినిమాలో న‌టించాల్సింది కానీ..ఆ సినిమాకు అమైరా కుంగ్‌ఫూ యోగా చిత్రంలో యాక్ట్ చేస్తుండ‌టం వ‌ల్ల అవ‌కాశాన్ని వ‌దులుకుంది.

ఇప్పుడు విష్ణుతో న‌టించ‌డానికి రెడీ అవుతుంది ఈ మ‌ద్దుగుమ్మ‌. మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం `ఆచారి..అమెరికాయాత్ర‌` సినిమాలో హీరోయిన్‌గా అమైరా ద‌స్త‌ర్‌ను న‌టించాల్సిందిగా యూనిట్‌వారు అడుగుతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అమైరా కూడా న‌టించ‌డానికి ఎక్క‌వ శాతం స్కోప్ ఉంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గా తిరుప‌తి పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.