close
Choose your channels

BJP:సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. త్రిముఖ పోరుకు సిద్ధం..

Tuesday, April 16, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. టీఎన్‌ వంశా తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణ కుమారుడే తిలక్ . ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోరు ఖాయమైంది. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించండతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న కంటోన్మెంట్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ తాజాగా ప్రకటించింది. మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉపఎన్నికకు కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్య నందితకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో లాస్య విజయం సాధించారు. అయితే దురదృష్టశాత్తూ ఎన్నికల ఫలితాలు విడుదలైన మూడు నెలల వ్యవధిలోనే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంవత్సరం వ్యవధిలోనే తండ్రి, కుమార్తె మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

లాస్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్‌కు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా బీజేపీలో నుంచి పార్టీలో చేరిన శ్రీ గణేష్‌కు టికెట్ కేటాయించగా.. బీఆర్ఎస్ కూడా లాస్య నందిత సోదరి నివేదితను టికెట్ ఖరారుచేసింది. మరి ఈ ఎన్నికల్లో సానుభూతి పరంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలుస్తుందో.. లేక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.