close
Choose your channels

అనుష్క, తమన్నా...ఒకరికి ఒకరు

Sunday, November 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది అందాల న‌టీమ‌ణులు అనుష్క‌, త‌మ‌న్నాకి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే... ఈ సంవ‌త్స‌రంతో ఈ ఇద్ద‌రు పదేళ్ల సినీ కెరీర్‌ని పూర్తిచేసుకున్నారు. అంతేకాకుండా.. తెలుగులోనే అతి పెద్ద హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న 'బాహుబ‌లి'లో హీరోయిన్స్‌గా న‌టించారు. అలాంటి ఈ ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లుగా ఓ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇంత‌కీ అదేమిటంటే.. అనుష్క న‌టించిన కొత్త చిత్రం 'సైజ్ జీరో'లో త‌మ‌న్నా ఓ అతిథి వేషంలో క‌నిపించ‌నుంటే.. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన 'ఊపిరి'లో అనుష్క ఓ అతిథి పాత్ర పోషించింది. ఒక‌రి సినిమాలో మ‌రొక‌రు అతిథి వేషాలేసిన ఈ ఇద్ద‌రికి.. ఆయా సినిమాల్లో కాంబినేష‌న్ సీన్స్ ఉన్నాయో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.