Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దేవిశ్రీ ప్రసాద్ కి మరో అవకాశం

IndiaGlitz [Friday, December 06, 2013]
Comments

తెలుగు నాట నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకున్న 'అత్తారింటికి దారేది' విజయంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగు చిత్ర సీమలో తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా. పరభాషా చిత్రాలతోనూ దేవిశ్రీ ప్రసాద్ అప్పుడప్పుడు సందడి చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా తమిళంలో ఈ యంగ్ సెన్సేషన్ కి మంచి గుర్తింపే ఉంది.

మొన్నీమధ్యే సూర్య నటించిన 'సింగం 2' తో తమిళనాట తన ఖాతాలో ఓ ఘనవిజయం వేసుకున్న దేవిశ్రీ.. సంక్రాంతికి రానున్న అజిత్ సినిమా 'వీరమ్'తోనూ పలకరించనున్నాడు. ఈ సినిమా విడుదలకు లోపే మరో సినిమాకీ దేవిశ్రీ కమిటయ్యాడని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

'జయం' రవి, నయనతార జంటగా 'జయం' రాజా రూపొందిస్తున్న చిత్రం కోసం సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ఎంపికయ్యాడని తమిళ తంబీలు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద క్రేజీ సినిమాలతో అక్కడి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లకు పోటీగా. మన తెలుగు సంగీత దర్శకుడు సందడి చేస్తుండడం సంతోషించదగ్గ విషయమే కదూ!




కన్నడ సీమలో బ్రహ్మానందం



Other News

 'Bandipotu' to be postponed
 Will his third film with NTR be successful ?
 Happy Birthday to the most celebrated comedian
 Allu Arjun's 'Son of Satya Murthy' movie details
 Shah Rukh Khan's villain for Ravi Teja
 'Daagudu Moothala Dandacore' audio launched
 'Temper' actress in Sunny Leone's film
 Anjali's 'Simhadripuram' ready for a release
 Samantha not acting in 'Bangalore Days' remake
 Gopichand's 'Jil' releasing in March



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Bandipotu' to be postponed
 Will his third film with NTR be successful ?
 Happy Birthday to the most celebrated comedian
 Allu Arjun's 'Son of Satya Murthy' movie details
 Shah Rukh Khan's villain for Ravi Teja
 'Daagudu Moothala Dandacore' audio launched
 'Temper' actress in Sunny Leone's film
 Anjali's 'Simhadripuram' ready for a release
 Samantha not acting in 'Bangalore Days' remake
 Gopichand's 'Jil' releasing in March
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.