1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిత్రం చెప్పిన కథ టీజర్ విడుదల

IndiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్,గరిమ, మదాల శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. ఈ సినిమా టీజర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మల్టీడైమన్షన్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, కాదంబరి కిరణ్, సంగీత దర్శకుడు మున్నా కాశీ, నిర్మాత కాశీ, దర్శకుడు మోహన్ ఏయల్లార్కే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో...మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ 'ఈ సినిమా చక్కని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. కచ్చితంగా సినిమా హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. తను మన మధ్య లేకపోవడం బాధాకరం. టీజర్ చాలా బాగుంది. మున్నాకాశీ మంచి సంగీతం ఇచ్చాడు. సినిమాని పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్ కి నివాళి ఇవ్వాలి' అన్నారు.

దర్శకుడు మోహన్ మాట్లాడుతూ 'ఉదయ్ గత సినిమాల్లోలా కాకుండా ఈ సినిమాలో డిపెరెంట్ లుక్ తో కనిపిస్తాడు. టీజర్ బాగుంది. సంగీతం బాగుంది. మంచి సినిమా అవుతుంది. సినిమా విడుదల తర్వాత మీరే చెబుతారు. ఉదయ్ చాలా జాగ్రత్తగా సినిమాని దగ్గరుండి చేయించుకున్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు' అని తెలిపారు.

చిత్ర నిర్మాతయ మున్నా మాట్లాడుతూ 'ఉదయ్ కిరణ్ తో కలిసి సంక్రాంతికి టీజర్ ను విడుదల చేద్దామనుకున్నాం. కానీ అప్పుడు కుదరలేదు. ఆయన లేనప్పుడు చేయడం చాలా బాధాకరం.
Telugu Film History Should Be Authored: Dasari

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.