1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పండగలే పండగలంటున్న నయనతార

IndiaGlitz [Tuesday, September 03, 2013]
Comments

ప్రభుదేవాతో ప్రేమాయణం వైఫల్యం చెందిన తరువాత కెరీర్ పైనే తన దృష్టినంతా కేంద్రీకరించింది మలబారు మగువ నయనతార.  ప్రస్తుతం ఆమెను బిజీగా మార్చేసిన సినిమాల్లో కొన్ని పండగల సందర్భంలో విడుదలకు ముస్తాబవుతున్నాయి.
 
హిందీలో విజయం సాధించిన 'కహానీ'కి రీమేక్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'అనామిక' దసరా కానుకగా విడుదల కావడానికి రెడీ అవుతుంటే.. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న తమిళ సినిమా 'ఆరంభం' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి విష్ణు వర్థన్ దర్శకుడు. అజిత్, నయనతార, విష్ణు వర్థన్ ల కలయికలో బిల్లా వంటి విజయ వంతమైన వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఆర్య, తాప్సీ మరో జంటగా నటిస్తుండగా.. రానా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
 
ఇక ఓకే ఓకే కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ కి జతగా నటిస్తున్న తమిళ సినిమా 'ఇదు కదిర్ వేలన్ కాదలి' కూడా దీపావళి సందర్భంలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ రెండు సినిమాలూ అనువాదాల రూపంలో మన ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తమ్మీద తన సినిమాలతో పండగలే పండగలన్నట్లుగా నయన వ్యవహారం ఉందన్నమాట.Director Sukumar To Don Producers Hat

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Director Sukumar To Don Producer's Hat
 'Mana Voori Saakshigaa' With Real Time Characters
 'Ramayya Vastavayya' Teaser Viral Record
 Prabhu Deva unveils Prabhu Deva!
 KISS To Be Released On 13th September
 MS Raju All Praise For AMAT Team
 Tanisshq Reddy Looking For Mass Appeal
 Guna Sekhars Rudrama Devi Into Third Schedule
 Bombay High Court Dismisses Salim Javeds plea of Rights On Zanjeer
 Thoofan US Schedules
 Thoofan Gets A Certified
 RGV Reminds Power Star Of His Power
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.