close
Choose your channels

విడుదలకు సిద్ధమవుతున్న 'సినీ మహల్'

Monday, January 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సినీ మహల్. రోజులకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కుతోంది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ `సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోవడానికి సిద్ధమైంది. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతానికి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రత్యేకగీతంలో నటించిన సలోనిగారికి థాంక్స్. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫ్రిభ్రవరిలో నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, నిర్మాతం బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.