close
Choose your channels

ఐదో హిట్ కొట్టిన పవన్ హీరోయిన్

Sunday, September 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని హీరోగా న‌టించిన 'మ‌జ్ను' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది అను ఎమ్మానియేల్‌. ఆ త‌రువాత రాజ్ త‌రుణ్ హీరోగా వ‌చ్చిన‌ 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'తో మ‌రో హిట్‌ని సొంతం చేసుకుందీ సుంద‌రి. ఈ చిత్రాల కంటే ముందు మ‌ల‌యాళంలో న‌టించిన 'స్వ‌ప్న‌సంచారి', 'యాక్ష‌న్ హీరో బిజు' కూడా అనుకి మంచి విజ‌యాలుగా నిలిచాయి.

ఇదిలా ఉంటే.. త‌మిళంలో అను క‌థానాయిక‌గా న‌టించిన మొద‌టి సినిమా 'తుప్ప‌రివాల‌న్' గురువారం విడుద‌లైంది. విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి హిట్ టాక్ రావ‌డ‌మే కాకుండా.. వ‌సూళ్లు కూడా బాగున్నాయి. అంటే.. వ‌రుస‌గా ఐదు విజ‌యాల‌తో అను స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్న అను.. అతి త్వ‌ర‌లో 'ఆక్సిజ‌న్‌'తో ప‌ల‌క‌రించ‌నుంది. మ‌రి చాలా రోజులుగా విడుద‌ల విష‌యంలో ఇబ్బందులు ప‌డుతున్న 'ఆక్సిజ‌న్' కూడా హిట్ అయితే.. అనుకి డ‌బుల్ హ్యాట్రిక్ ద‌క్కిన‌ట్టే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.