close
Choose your channels

రామ్మోహన్ కి కాఫీకి పిలవలేదా?

Tuesday, November 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అవికాగోర్ న‌టించిన సినిమా త‌ను నేను. ఈ నెల 27న విడుద‌ల కానుంది. ఈ నెల 27న అనుష్క న‌టించిన న‌టించిన సైజ్ జీరో విడుద‌ల కానుంది. ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డు రాకుండా శంక‌రాభ‌ర‌ణం, ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ చిత్రాలు అడ్డుత‌ప్పుకున్నాయి. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఈ సినిమాల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ఆయా చిత్రాల నిర్మాత‌లు పీవీపీ, కోన వెంక‌ట్‌, కె.కె.రాధామోహ‌న్ ప్ర‌క‌టించారు. మ‌రో సినిమా కూడా అదే రోజు విడుద‌ల‌కుంది అని విలేక‌రులు చెప్ప‌గా కోన‌వెంక‌ట్ స్పందిస్తూ ``అవునా. అయితే కాఫీకి పిలిచేద్దాం`` అని అన్నారు. అందుకు పీవీపీ న‌వ్వుతూ కాఫీ విత్ కోన అంటే అంతా సెటిలైన‌ట్టే అని చెప్పారు. సో అవికాగోర్‌కు త‌మ సినిమాకు పోటీగా పీవీపీ భావించ‌లేదేమో. లేక రామ్మోహ‌న్ ను కోన కాఫీకి పిల‌వ‌లేదేమో మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.