close
Choose your channels

కార్తీ 'ఖాకి' రిలీజ్ డేట్

Tuesday, September 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌`. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా నిర్మాత‌గా కార్తీ, ర‌కుల్ జంట‌గా రూపొందిన చిత్రం `ఖాకీ`. తమిళ సినిమా ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు`ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌`... అనేది ఉపశీర్షిక. త‌మిళంలో చతురంగ వేటై్ట` ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

2005లో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన వాస్త‌వ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు వినోద్ ఈ క‌థ‌ను సిద్ధం చేశారు. కార్తీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు అన్నీ విధాలుగా స‌న్న‌ద్ధం అవుతుంది. సినిమాను న‌వంబ‌ర్ 17న విడుద‌ల చేస్తున్నారు. అంత కంటే ముందుగా సెప్టెంబ‌ర్ 27న టీజ‌ర్‌, అక్టోబ‌ర్ 17న ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నారు. బిబ్రాన్ సంగీతం అందించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.