close
Choose your channels

మంచు లక్ష్మీ ఇంటర్వ్యూ!!

Tuesday, March 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు లక్ష్మీ ప్రసన్న ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం `ల‌క్ష్మీ బాంబ్`. గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా ఈనెల 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో మీడియాతో ముచ్చ‌టించారు. ఆ వివ‌రాలు..

ఛాలెంజింగ్ రోల్ అది

సెంటిమెంట్, కామెడీ, ఎమోష‌న్స్ ఇలా అన్ని అంశాలున్న సినిమా క‌థ ఇది. అన్ని పాత్ర‌లు హైలైట్ గా ఉంటాయి. ఇందులో రెండు డిఫ‌రెంట్ పాత్ర‌లు పోషిస్తున్నా. అందులో ఒక‌టి డిఫరెంట్‌గా ఉండే జడ్జి పాత్రలో కనపడతాను. ఇప్ప‌టివ‌ర‌కూ చేయని చాలెంజింగ్ రోల్ అది. డైరెక్ట‌ర్ క‌థ చెప్పినప్పుడు వెంట‌నే ఒకే చేశాను. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మాణం జ‌రిగింది. అని వార్య కార‌ణాల వ‌ల్ల సినిమా డిలే అయింది.

అంద‌ర్నీ న‌మ్ముతా
దేవుళ్లు అంటే బాగా న‌మ్ముతా. వాళ్లే లేక‌పోతే మ‌నం లేము కదా. ఈ సినిమా దేవ‌త‌ల్ని అంద‌ర్నీ న‌మ్మే సినిమా చేశా. త్రిశూలం ప‌ట్టుకుని న‌టించ‌డం చాలా ఎగ్జైట్ గా అనిపించింది. ఆహార్యం. పెర్పామెన్స్ అన్నీ చాలా కొత్త‌గా అనిపించాయి.

మార్కెట్ ఉంద‌ని ఫీల‌య్యా..
నా పేరు పెట్టి సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. సాధార‌ణంగా సినిమా టైటిల్స్ అంటే క‌థ‌ను బ‌ట్టి పెడుతుంటారు. కానీ ఇందులో క‌థ‌తో పాటు.నా పేరుకు ఆ టైటిల్ యాప్ట్ అయింది. అందుకే అలా పెట్టాం. అలాగే హీరో మార్కెట్ ను బేస్ చేసుకుని టైటిల్స్ పెడుతుంటారు. ఈ టైటిల్ తో నాకు మంచి మార్కెట్ ఉంద‌ని ఫీల‌య్యా. అలాగే ఈ టైటిల్ తో సినిమా అంటే నా కుటుంబ స‌భ్యులు కూడా సంతోషించారు.

నా ర‌క్తం మ‌రిగిపోయింది
ఫ‌లానా హీరోయిన్ కు అలా జ‌రిగింద‌ని పేరు పెట్టి మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు. మీడియా పేరు పెట్టి రాసేసింది. అది చాలా త‌ప్పు. ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. కానీ దాన్ని మ‌రీ భూత‌దం పెట్టి చూప‌డం బాగా లేదు. నిజానికి ఆ న్యూస్ విన్న వెంట‌నే నార‌క్తం మ‌రిగిపోయింది. అదీ వాళ్ల ఉప్పు తిన్న వాళ్లే అలా చేశారంటే ఎంత అమానుషం అనిపించింది. అలాంటి ఆకృత్యాల‌కు పాల్ప‌డే వారిని క‌ఠినంగా శిక్షించాలి. అప్పుడే వాళ్ల‌కు బుద్ది వ‌స్తుంది.

మంచి క‌థ కుద‌రాలి
పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌లో మా ఫ్యామిలీ అంతా క‌లిసి న‌టించాం. మంచి స‌క్సెస్ అయింది. అయినా మ‌ళ్లీ మేమంతా క‌లిసి న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నాం. మంచి క‌థ కుద‌రాలి. ఓ యూనిక్ థాట్ తో ఆ సినిమా ఉంటే బాగుంటుంది. సినిమాల నిర్మాణం మ‌ళ్లీ స్పీడ్ అప్ చేయాలి. ఇటీవ‌ల డ‌బ్బులు లేక స్పీడ్ త‌గ్గింది. మంచి కంటెట్ ఉన్న క‌థ‌ల‌ను తెర‌కెక్కించా. ఇటీవ‌లే ఒక సినిమా క‌మిట్ అయ్యా. ఇంకా సంత‌కం చేయ‌లేదు. ఆ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తా.

నా దృష్టిలో ఇద్ద‌రూ స‌మాన‌మే
ఉమెన్స్ డే..మెన్స్ డే అంట? నాకు అలా విభ‌జించ‌డం తెలియ‌దు. డ‌బ్బులు కావాలంటే మ‌గవాళ్ల‌నే అడుగుతాం. ఏ వ‌స్తువులు కొనాల‌న్నా వాళ్ల‌పైనే ఆధార‌ప‌డ‌తాం. అలాంటప్పుడు మెన్స్ డే ఎందుకు లేదు. ఆ మాట‌కు నేను వ్య‌తిరేఖిని. నా దృష్టిలో ఇద్ద‌రూ స‌మాన‌మే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.