close
Choose your channels

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

Thursday, May 2, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది.. ఇక ఇంటికి పంపడమే మిగిలింది అని జనసేన అధినేత వపన్ కల్యాణ్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మా.. నాన్న లేని బిడ్డను.. చెల్లి నాన్న లేని బిడ్డను ఒకసారి అవకాశం ఇవ్వండని 2019 ఎన్నికల్లో జగన్ అడిగితే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. ఒక్క ఛాన్స్‌కే అదే ప్రజలకి భవిష్యత్తు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలు ఈసారి వారి భవిష్యత్తుకు ఛాన్సు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

‘ప్రజల ఆస్తులన్నీ కాజేసే కుట్రతో తీసుకొచ్చిన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును కేంద్రం మీదకు తోసి వైసీపీ చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రం చట్టాలు చేస్తే.. రాష్ట్రాలు తమకు అనుగుణంగా ముసాయిదా అమలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ప్రజల ఆస్తులపై కన్నేసి, మరిన్ని అదనపు అంశాలను జోడించి ‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు’’ను తీసుకొచ్చింది ఏపీ సర్కార్. ఈ చట్టం ప్రకారం భూమి ఎవరైనా కబ్జా చేస్తే కనీసం కేసులు, కోర్టులు కూడా ఉండవు. మన ఆస్తిలో మనం కొన్ని రోజుల పాటు ఉండకపోతే అది అన్యాక్రాంతం అయి, మనకు తెలియకుండానే చేతులు మారిపోతుంది. ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు. కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారట. ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయి.

మన ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఈ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టులో ఇలాంటి సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. జగన్‌కు ఓటేస్తే మన సొంత ఆస్తులన్నీ గాలిలో దీపాలే అవుతాయి. ఒక్కసారి ఛాన్సు అడిగి జగన్ ఎన్ని దాష్టీకాలు చేశాడో మీకు తెలుసు. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోండి. ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే ఛాన్సు ఇది. నాకు ప్రజల కోసం పోరాటం మాత్రమే తెలుసు. పోలవరం పునరావాస బాధితులకు అండగా ఉంటూనే, సెజ్‌లలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకీ అండగా ఉంటాను’ అన్నారు.

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, దానికి సంబంధించి డిజిటల్ కార్డుల పంపిణీ దేశంలోనే ఓ ఆరోగ్య విప్లవం అవుతుంది. తమకు అందుబాటులో ఉండే పెద్ద ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు. దీనికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల సాయం, 10 మందికి ఉపాధినిచ్చే స్టార్టప్, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల రాయితీతో యువతను ఎంటర్ ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతుంది. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి కోసం కూటమి కట్టుబడి ఉంది. ఉపాధి జోన్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే ఉద్యోగాలను యువతకు అందేలా చేస్తాం" అని తెలిపారు.

ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు పెడితేనే వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. గడగడపకు కార్యక్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఫీజు రియంబర్సుమెంటు రాలేదని అడిగితే ఆ విద్యార్థిని చావబాదారు. ఈ ఎమ్మెల్యే సింహాచలం ఆలయ భూములను ఇష్టానుసారం ఆక్రమించి భవంతులు కడుతున్నారు. 22ఏ నిషేధిత భూములపైనా కన్నేశారంటే ఎంతకు తెగించారో అర్ధం అవుతుంది. నియోజకవర్గంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఈయనకు పర్సంటేజీ ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. కూటమి పాలనలో గంజాయి రవాణా చేసిన వారిని, మత్తు పదార్థాలు యువతకు అలవాటు చేసిన వారిని వదిలిపెట్టబోం అన్నారు. పాలన మొదలైన 100 రోజుల్లోపే గంజాయి ముఠాలకి ముకుతాడు వేస్తాం. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరిగేలా చట్టాలను కఠినతరం చేస్తాం" అని హామీ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos