close
Choose your channels

బాల‌య్య పేరుని టాటూగా వేసుకున్నయంగ్ హీరో

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య పేరుని యంగ్ హీరో నాని టాటూగా వేసుకున్నారు. ఇంత‌కీ నాని బాల‌య్య పేరు టాటూగా ఎందుకు వేసుకున్నారు అనుకుంటున్నారా..? నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

ఈ చిత్రంలో నాని బాల‌య్య అభిమానిగా న‌టిస్తున్నారు. అందుచేత పాత్ర‌కు త‌గ్గ‌ట్టు నాని చేతిపై జై బాల‌య్య అనే టాటూ వేయించుకున్నాడు. అస‌లు ఈ చిత్రానికి కూడా జై బాల‌య్య అనే టైటిలే పరిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ నాని ఆ వార్త‌ల‌ను ఖండించాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసి..డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.