close
Choose your channels

ఎన్టీఆర్ వచ్చే నెలలో జాయిన్ అవుతాడట...

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`(రిజిష్ట‌ర్ అయిన టైటిల్‌). ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న నివేదాథామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

అందులో తండ్రి పాత్ర ఒక‌టి కాగా, ట్విన్ బ్ర‌ద‌ర్స్‌గా కూడా న‌టిస్తున్నాడు. మార్చి 10 నుండి షూట్‌లో ఎన్టీఆర్ పాల్గొంటాడ‌ట‌. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా సి.కె.ముర‌ళీధ‌రన్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియ‌న్స్‌ను రంగంలోకి దింపాడు నిర్మాత క‌ళ్యాణ్ రామ్‌. ఐరన్ మ్యాన్‌, లార్డ్ ఆఫ్ రింగ్స్‌, లైఫ్ ఆఫ్ పై, రోబో చిత్రాల‌కు ప్రోస్థెటిక్‌, లెగ‌సీ వ‌ర్క్‌ను అందించిన వాన్స్ హార్ట్ వెల్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.