close
Choose your channels

'పందెంకోడి2' కు ముహుర్తం కుదిరింది

Monday, July 31, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎప్పుడో సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది కానీ, కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.
తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ పందెంకోడి2 సినిమాను ఆగ‌స్ట్ 31న లాంచ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. ఈ సీక్వెల్‌లో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సీక్వెల్‌కు యువ‌న్‌శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తుండ‌గా, మ‌ది సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ లోపు విశాల్ తుప్ప‌రివాల‌న్ సినిమాను పూర్తి చేసేస్తాడు. పందెంకోడి2 చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దింపాల‌ని యూనిట్ యోచిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.