close
Choose your channels

Telugu Indian Idol:అమెరికాలో తొలిసారిగా ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్' ఆడిషన్స్

Friday, April 26, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో.. మూడో సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ మేరకు ఆడిషన్స్‌కు సంబంధించిన తేదీలు వెల్లడయ్యాయి. దీంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకునే వారితో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా మెగా ఆడిషన్స్ మొదటిసారిగా అమెరికాలో ప్రారంభం కానుండటం విశేషం.

మే 4న న్యూజెర్సీలో TV9 USA స్టూడియోస్.. మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్, డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్, లూయిస్ విల్లేలో ఆడిషన్స్ జరగనున్నాయి. ఇక హైదరాబాద్‌లో మెగా ఆడిషన్‌లు మే 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. రెండు సీజన్స్‌కు సంగీత ప్రేమికులు, ప్రేక్షకుల నుంచే కాకుండా ఔత్సాహిక గాయకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. టెలివిజన్ రంగంలో ఈ కార్యక్రమం సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దీంతో మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ అంచనాలను అందుకునేలా ఉంటుందని ఆహా హామీ ఇస్తోంది. అందుకు కారణం ఏకంగా 10వేల మంది ఔత్సాహిక గాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు. సంగీత దిగ్గజలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి నేతృత్వంలో గొప్ప న్యాయ నిర్ణేతల బృందం దీనికి మార్గనిర్దేశకం చేస్తోంది.

సీజన్ 2కు వచ్చిన స్పందన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అసాధారణ సంగీత ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. న్యాయనిర్ణేతల అమూల్యమైన మార్గదర్శకత్వం, నిర్మాణాత్మకమైన సద్విమర్శలు.. అలాగే పోటీదారులను ఆరోగ్యకరమైన వాతావరణంతో ప్రోత్సహించడం అనేది ఔత్సాహిక గాయకులను గొప్పగా తీర్చిదిద్దడంలో, గొప్ప నైపుణ్యాలను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు సీజన్ 3.. అదే ఉత్సాహంతో సరికొత్త ప్రయాణాన్ని ఉల్లాసకరంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అసాధారణమైన ప్రతిభను వేదిక ప్రదర్శించటమే కాకుండా.. సంగీతాభిమానులకు సమానమైన వినోదాన్ని అందించటంలో ఆహా తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఔత్సాహిక గాయకులు తమ గాత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి గౌరవనీయమైన టైటిల్ కోసం పోటీ చేయటాని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆహా సంస్థ కోరుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.