close
Choose your channels

Kalki2898AD:ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి' రిలీజ్ డేట్ వచ్చేసింది..

Saturday, April 27, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఏడాది జూన్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పడుకొనే పక్కపక్కన నిల్చొని ఉన్నారు.

వాస్తవంగా ఈ ఏడాది వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుడంటం.. అలాగే కొన్ని ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ జూన్ 1వరకు పోలింగ్ జరగనుంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. అప్పటినుంచి సినిమా విడుదల తేదీపై రోజుకొక వార్త వస్తుంది. తాజాగా మేకర్స్ కొత్త డేట్ ప్రకటించడం ఆ వార్తలకు ఫుల్ స్టాప్‌ పడింది. జూన్ 4తో ఎన్నికల ఫలితాలు వస్తాయి. అప్పటి నుంచి దేశంలో ఎన్నికల హడావిడి ఉండదు. దీంతో జూన్ 27న మూవీ విడుదలకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవల నాగ్ అశ్విన్ ఈ కథ గురించి మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.