close
Choose your channels

సైకాలాజికల్ థ్రిల్లర్ '9' మూవీ టీజర్ విడుదల

Saturday, May 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌న శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్‌, శ్రిత చందన‌, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్ త‌దిత‌రులు తారాగ‌ణంగా అశ్విని కుమార్‌.వి ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మిస్తోన్న సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `9`. ఈ సినిమా టీజ‌ర్‌ను హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.

నాకు రెండు ప్రొడ‌క్ష‌న్స్ హౌసెస్ ఉన్నాయి. అందులో ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌స్తున్న తొలి చిత్రం `9`. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను2016 ఫిబ్ర‌వ‌రిలో స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం 9 నెల‌లు పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశాం. సినిమాను 32 రోజుల్లో తీద్దామ‌ని అనుకున్నాం. కానీ 27 రోజుల్లోనే పూర్తి చేశాం. మ‌ద‌న‌ప‌ల్లి, హార్సిలీ హిల్స్‌, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమాను షూట్ చేశాం. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌హ‌కారంతోనే సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేశామ‌ని నిర్మాత శ్వేతాసింగ్ తెలిపారు.

2011లోనే క‌థ‌ను సిద్ధం చేసుకుని ఇదే క‌థ‌పై షార్ట్ ఫిలిం కూడా చేశాం. ఐదారేళ్ళ‌లో క‌థ‌లో చాలా మార్పులు చేర్పులు జ‌రిగాయి. క‌థ విన్న నిర్మాత‌లంద‌రూ బావుందంటున్నారు, కొత్త‌గా ఉంద‌ని అన్నారు కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ యాడ్ చేయ‌మ‌ని చెప్పేవారు. కానీ అవేవీ లేకుండానే ఈ క‌థ ఆడియెన్స్‌కు న‌చ్చుతుంద‌ని నాకు న‌మ్మ‌కం ఉండేది. 2016లో శ్వేతా సింగ్‌గారు మాత్రం క‌థ‌ను న‌మ్మి ఏ మార్పు లేకుండా సినిమా చేయ‌మ‌ని అన్నారు. సినిమా టైటిల్ 9 అనే సంఖ్య చుట్టూ క‌థ‌కు సంబంధించి చాలా అంశాలు ముడిప‌డి ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే న‌లుగురు ఘోస్ట్ హంట‌ర్స్ ఓ హాంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా లేవా అని ప‌రిశోధ‌న చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు వారికెలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నేదే సినిమా క‌థ‌. సినిమా బాగా వ‌చ్చిందని ద‌ర్శ‌కుడు అశ్వినికుమార్ చెప్పారు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌. న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్ అని సినిమాటోగ్రాప‌ర్ సునీల్ కుమార్ చెప్ప‌గా, సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఓ ఇంగ్లీష్ సాంగ్ కూడా సినిమాలో ఉంటుంది. ట్యూన్స్ చేయ‌డానికి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయ‌డానికి నాకు చాలా స్వేచ్ఛ‌నిచ్చారని మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల తెలిపారు. `

ఈ కార్య‌క్ర‌మంలో అషిమా న‌ర్వాల్‌, శ్రిత చంద‌న‌, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్‌, విమ‌ల్ కృష్ణ త‌దిత‌రులు సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని అన్నారు.

అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌న శాస్త్రి, అషిమా న‌ర్వాల్‌, శ్రిత చంద‌న‌, సుధారాణి, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్‌, విమ‌ల్ కృష్ణ‌, అభిషేక్ మ‌హ‌ర్షి, అభిన‌వ్ గోమాతం, స‌మీర్ హాస‌న్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టించిన క‌బీర‌ఈ చిత్రానికి విఎఫెక్స్ః వెంక‌ట్‌.కె, సౌండ్ ఎఫెక్ట్స్ః విష్ణు పి.సి, అరుణ్.ఎస్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ః అశ్వంత్ బైరీ, కొరియోగ్ర‌ఫీః ఉద‌య్‌భాను, ఎడిట‌ర్ః గారీ బి.హెచ్‌, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్ః కిర‌ణ్‌కుమార్‌.ఎం, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ర‌మేష్ శ‌ర్మ‌.ఎం, నిర్మాతః శ్వేతా సింగ్‌, స్ర్కీన్‌ప్లే, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వంః అశ్వినికుమార్‌.వి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.