close
Choose your channels

శ్రీవాస్ చేతులమీదుగా 'శేఖరం గారి అబ్బాయ్' మోషన్ పోస్టర్

Thursday, March 30, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. ఇటీవ‌ల‌ కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు లాంచ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని ప్ర‌ముఖ దర్శ‌కులు శ్రీ‌వాస్ ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా శ్రీ‌వాస్ మాట్లాడుతూ -``ద‌ర్శ‌కురాలు, క‌థానాయిక అక్ష‌త‌కు గుడ్ ల‌క్‌. మంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది విజ‌య‌వంతంగా ముందుకు సాగాలి. మునుముందు మ‌రిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలి. చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.
దర్శకురాలు, క‌థానాయిక‌ అక్షత మాట్లాడుతూ ``అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు. సూప‌ర్‌డూప‌ర్ హిట్ ఇచ్చిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మోహ‌న్‌బాబు గారు ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేసి ఆశీస్సులు అందించారు. పెద్ద‌ల ఆశీస్సులు మాకు కావాలి. ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న కొత్త‌వారికి, స్ట్ర‌గ్లింగ్ ఆర్టిస్టులు అంద‌రికీ మంచి జ‌ర‌గాలి`` అన్నారు.
హీరో విన్ను మాట్లాడుతూ-`ల‌క్ష్యం, డిక్టేట‌ర్ లాంటి పెద్ద విజ‌యాలు ఇచ్చిన శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం వ‌రంలా భావిస్తున్నా. పెద్ద‌ల ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజ‌యం అందుకుంటాం. అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు`` అన్నారు.
నిర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ ``టాకీ పూర్త‌యింది. ఫ‌స్ట్‌లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. మోష‌న్ పోస్ట‌ర్ అంద‌రికీ న‌చ్చింది. త్వ‌ర‌లోనే పాటలు రిలీజ్ చేస్తాం`` అన్నారు.
కార్యక్రమంలో సూర్య, అనురూప్ ,డి.ఎం.కె , సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ, కూర్పు: నందమూరి హరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.