తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీం చిత్రాల తర్వాత బిచ్చగాడు సక్సెస్‌తో విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. తర్వాత నుండి విజయ్ ఆంటోని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావడం స్టార్ట్ అయ్యాయి. భేతాళుడు, యమన్ సినిమాలు అలా విడుదలైనవే. కాగా ఇప్పుడు తెలుగులో కూడా తన మార్కెట్ మరింత పెంచుకోవాలనుకుంటున్న విజయ్ ఆంటోని ఇప్పుడు తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నాడట. ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకుంటున్నాడట. విజయ్ ఆంటోని తదుపరి చిత్రం అన్నాదురై. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా నడుస్తుందని సమాచారం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రీకరణ జరుపనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.