close
Choose your channels

ఇది త‌మ‌న్ దండ‌యాత్ర‌

Saturday, October 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగునాట జోష్‌ఫుల్‌గా కెరీర్ ని కొన‌సాగిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో త‌మ‌న్ ఒక‌రు. ఓ వైపు అగ్ర క‌థానాయ‌కుల సినిమాల కోసం ప‌నిచేస్తూనే.. మ‌రోవైపు కుర్ర హీరోల సినిమాల కోస‌మూ హుషారైన బాణీల‌ను అందిస్తూ రేసు గుర్రంలా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడీ యువ త‌రంగం. గ‌తేడాది రేసు గుర్రం, ప‌వ‌ర్ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో సంద‌డి చేసిన‌ త‌మ‌న్.

ఈ ఏడాదిలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆశించిన విజ‌యాల‌ను త‌న కైవ‌సం చేసుకోలేక‌పోయాడు. ఈ సంవ‌త్స‌రంలో బీరువా, టైగ‌ర్‌, పండ‌గ చేస్కో, కిక్ 2 త‌దిత‌ర చిత్రాలు చేసినా.. త‌మ‌న్‌కి అవి కిక్ ఎక్కించే స‌క్సెస్‌ల‌నైతే ఇవ్వ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. రానున్న సినిమాల‌పై ఈ సంగీత సంచ‌ల‌నం భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ నెల‌లో వ‌రుస‌గా మూడు వారాల‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న త‌న సినిమాలు త‌న హ‌వాను మ‌రోసారి చాటేలా ఉంటాయ‌ని త‌మ‌న్ భావిస్తున్నాడు.

ఈ నెల 16న రామ్‌చ‌ర‌ణ్ బ్రూస్ లీ, 22న అఖిల్ (ఇందులో ప‌డేసావే అనే పాటకి కంపోజ్ చేశాడు), 30న క‌ళ్యాణ్ రామ్ షేర్ చిత్రాలు త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ స్క్రీన్‌పైకి రానున్నాయి. ఈ మూడూ చిత్రాలు మంచి విజ‌యాలు సాధించి త‌న‌కు ఒకే నెల‌లో హ్యాట్రిక్ ముచ్చ‌ట‌ని అందిస్తాయ‌ని త‌మ‌న్ ఆశిస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.