close
Choose your channels

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ ముహుర్తం..

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా హీరో వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొందనున్న‌ద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. ఆగ‌డు, బ్రూస్ లీ...ఈ రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఎలాగైనా స‌రే ఈసారి విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో శ్రీను వైట్ల క‌థ‌ను సిద్దం చేసారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని ఈనెల 27న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. తొలి చిత్రం నుంచి విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తున్న వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో కూడా గ‌త చిత్రాల‌కు భిన్నంగా క‌నిపిస్తాడ‌ట‌.ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ప్రారంభోత్స‌వం రోజు తెలియ‌చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.