close
Choose your channels

ఉగాదికి వెంకీ ఫస్ట్ లుక్..

Sunday, April 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబూ..బంగారం. లక్ష్మీ, తులసి చిత్రాల తర్వాత హిట్ పెయిన్ వెంకటేష్, నయనతార ఈచిత్రంలో నటిస్తుండటం, భలే భలే మగాడివోయ్ వంటి సక్సెస్ తర్వాత మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అల్రెడి సినిమా బిజినెస్ కూడా ఫ్యాన్సీ ఆఫర్ తో పూర్తయిందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉండటం సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండటంతో సినిమా విడుదలను జూన్ 1న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.