కొత్త ద‌ర్శ‌కులు .. పెద్ద స‌క్సెస్‌లు

సినిమా ప‌రిశ్ర‌మలో కొత్త టాలెంట్‌కు రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. మ‌నం చెప్పే పాయింట్ పాత‌దే కావ‌చ్చు కానీ..దాన్ని ఆడియెన్స్‌కు న‌చ్చేలా ఎలా ప్రెజెంట్ చేశామ‌నేదే ముఖ్యం. ఏటా దాదాపు రెండు వంద‌లు సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. అందులో పెద్ద హీరోల సినిమాలు, మీడియం బ‌డ్జెట్ చిత్రాలు 40-50 చిత్రాలు ఉన్నా..మిగిలిన 150-160 చిత్రాలు మాత్రం చిన్న చిత్రాలే. ఈ చిన్న చిత్రాల ద్వారా కొత్త ద‌ర్శ‌కులు స‌హా ఇత‌ర టెక్నిషియ‌న్స్ సినీ ఇండ‌స్ట్రీలోకి త‌మ ఎంట్రీని సుగ‌మ‌నం చేసుకుంటూ ఉంటారు. ఈ సాంకేతిక వ‌ర్గంలో ముఖ్యులు ద‌ర్శ‌కులే. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా పేరున్న ద‌ర్శ‌కుల్లోకొత్త‌వారు 2017లో ఎలాంటి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నార‌నే విష‌యాల‌ను చూస్తే..

సంక‌ల్ప్ రెడ్డి

ఈ యువ ద‌ర్శ‌కుడిని చూస్తే..ఇత‌నేంటి ఇంత మొహ‌మాట‌స్తుడిలా ఉన్నాడు. ఇత‌నేం డైరెక్ట్ చేస్తాడ‌ని చాలా మంది నిర్మాత‌లు అనుకున్నారు. స‌రేలే కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది క‌దా..క‌నీసం షార్ట్ ఫిలిం అయినా చేద్దామ‌ని ..లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద స‌బ్ మెరైన్ సెట్ వేసి అందులో షూటింగ్‌ చేయ‌డం ప్రారంభించాడు. అది చూసిన హీరో రానా అస‌లు సినిమా క‌థేంటో తెలుసుకుని షాక్ తిన్నాడు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రానీ క‌థ‌. స‌బ్ మెరైన్ నేప‌థ్యంలో సాగే సినిమా. రానా వెంట‌నే ఇలాంటి సినిమా వ‌దులుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ..నిర్మాత‌లు పివిపి, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ నిరంజ‌న్‌ను క‌లిసి సినిమా ప్ర‌పోజల్‌ను పెట్టాడు. వారికి కూడా క‌థ న‌చ్చ‌డంతో సినిమా పెద్ద లెవ‌ల్‌లోనే ప్రారంభ‌మైంది. కె.కె.మీన‌న్‌, ఓంపురి, నాజ‌ర్‌, అతుల్ కుల‌క‌ర్ణి వంటి స్టార్స్ టీమ్‌లో జాయిన్ అయ్యారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా పెద్ద సెన్సేష‌న్‌కు దారి తీసింది. 1971లో ఇండో పాక్ యుద్ధానికి ముందు అండ‌ర్ వాట‌ర్‌లో జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించి సంక‌ల్ప్ రెడ్డికి ఇండ‌స్ట్రీలో మంచి స్థానాన్ని ఏర్ప‌రిచింది.

శివ నిర్వాణ

నాని..వ‌రుస స‌క్సెస్‌ల‌పై ఉన్న హీరోని విలేఖ‌రులు ప్ర‌శ్నించారు. త‌దుప‌రి మీరే సినిమా చేస్తున్నార‌ని..శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని అన్నారు. నాని లాంటి స‌క్సెస్ మీదున్న హీరో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడంటే క‌థ‌లో మాంచి ద‌మ్ముండాలి. లేదా నాని రిస్క్ అయినా చేస్తుండాల‌ని అన్నారు. టీచ‌ర్ కావాల‌నుకున్న శివ నిర్వాణ‌, సినిమాల‌పై పిచ్చితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. షార్ట్ ఫిలిం చేసి దాన్నొక ట్రంప్ కార్డులా వాడి..నానికి ఓ ల‌వ్‌స్టోరీ చెప్పి..ద‌ర్శ‌కుడిగా చాన్స్ కొట్టేశాడు. ప్రేమించుకున్న వారు విడిపోవ‌చ్చు. కానీ ప్రేమ ఎప్పుడూ గొప్ప‌దే అనే పాయింట్‌ను శివ తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. సినిమా పెద్ద హిట్ ..నానికి వ‌రుస‌గా ఏడో హిట్ వ‌చ్చేసింది. శివ నిర్వాణ‌కు ద‌ర్శ‌కుడిగా దారులు తెరుచుకున్నాయి.

సందీప్ రెడ్డి వంగా

2017లో ఈ ద‌ర్శ‌కుడి పేరు వినిపించినంతగా మ‌రే ద‌ర్శ‌కుడి పేరు వినిపించ‌లేదు. పేరు ఊరు తెలియ‌ని ద‌ర్శ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ `అర్జున్ రెడ్డి` అన‌గానే..ఇదేదో యాక్ష‌న్ మూవీయో, ఫ్యాక్ష‌న్ మూవీయో అనుకున్నారు కానీ భిన్నంగా సందీప్ ప్రేమ‌క‌థ‌ను తీశాడు. నిజ‌మైన ప్రేమ ఎలా గెలిచింది?. ప్రేమ‌ను ద‌క్కించుకోలేక‌పోయిన ప్రేమికుడు ఏమైయ్యాడు?. చివ‌ర‌కు త‌న ప్రేమ‌నెలా దక్కించుకున్నాడ‌నేదే? సినిమా. ఈ ఏడాది చిన్న చిత్రాల్లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇదే. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను హాట్ కేకుల్లో కొనేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు, సినిమా విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని పెద్ద ర‌చ్చే సాగింది. అయితే ద‌ర్శ‌కుడు సందీప్‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా కాన్ఫిడెంట్‌గా స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. సినిమా చూసిన స్టార్ హీరోలంద‌రూ అప్రిసియేట్ చేశారు. త్వ‌ర‌లోనే ఓ స్టార్ హీరోతో సందీప్ సినిమా చేయ‌బోతున్నాడు.

వివేక్ ఆత్రేయ‌

పాతికేళ్లు కూడా లేని ఈ యువ‌కుడికి తెలుగుపై మంచి ప‌ట్టుంది. తెలుగు సాహిత్యంపై ఉన్న ప‌ట్టుతో కావ్యం అనే ప్రేమ‌క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. పెళ్ళిచూపులు అనే సినిమా ద్వారా కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరిని క‌లిసి కావ్యం క‌థ చెప్పాడు. కానీ ఆ క‌థ చాలా స్లోగా ఉంది, ఏదైనా ల‌వ్ స్టోరీ ఉంటే చెప్ప‌మ‌ని అన్నాడు రాజ్ కందుకూరి వెంట‌నే రెండు రోజుల త‌ర్వాత వివేక్ క‌న్‌ఫ్యూజ‌న్ అయ్యే హీరో, ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందనేదే క‌థ‌. అంత‌కు ముందు షార్ట్ ఫిలింస్ చేసిన అనుభ‌వం సినిమా మేకింగ్‌లో ఎంతో ప‌నికొచ్చింది. హీరో, హీరోయిన్, ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే, అంతే కొత్త టీం ఈ సినిమాకు ప‌నిచేసింది. సినిమా మంచి స‌క్సెస్ సాధించింది. .

గౌత‌మ్ తిన్న‌నూరి

సుమంత్‌కు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ క‌థ చెబుతున్నాడు. ఒక ప‌క్క టెన్ష‌న్‌గా కూడా ఉంది. ఎందుకంటే అంత‌కు ముందు క‌థ విన్న ప‌దిహేను మంది నిర్మాత‌లు ఈ క‌థ విని సింపుల్‌గా నో చెప్పేశారనేదే మెయిన్. అయితే సుమంత్ సినిమా చేస్తాన‌ని అన్నాడు. ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుమంత్‌కు మంచి కథ దొరికింది. సినిమా ల‌వ్‌స్టోరీ. కానీ గౌత‌మ్ క‌థ‌ను డీల్ చేసిన విధానం ఎంతో బాగా న‌చ్చ‌డంతో ప్రేక్ష‌కులు సినిమాకు స‌క్సెస్‌ను క‌ట్ట‌బెట్టారు.

సినిమా పరిశ్రమలో కొత్త టాలెంట్ కు రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. మనం చెప్పే పాయింట్ పాతదే కావచ్చు కానీ..దాన్ని ఆడియెన్స్కు నచ్చేలా ఎలా ప్రెజెంట్ చేశామనేదే ముఖ్యం. ఏటా దాదాపు రెండు వందలు సినిమాలు విడుదలవుతుంటాయి.