close
Choose your channels

2020.. చిత్ర పరిశ్రమకే బొమ్మ చూపించింది.. కానీ ఆయనకు మాత్రం..

Tuesday, December 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2020.. చిత్ర పరిశ్రమకే బొమ్మ చూపించింది.. కానీ ఆయనకు మాత్రం..

2020.. మామూలుగా లేదుగా.. చిత్ర పరిశ్రమ అయితే ఇప్పటికీ కోలుకోలేదు. ఇండస్ట్రీ పరంగా బాక్సాఫీస్‌ను షేక్ ఆడించే సినిమాలతో ఫుల్ జోష్‌తో ప్రారంభమైన ఈ సంవత్సరం.. మార్చి మూడో వారం వచ్చేనాటికి పరిస్థితి తలకిందులైంది. షూటింగ్‌లు లేవు.. థియేటర్లు క్లోజ్.. ఎవరికి వారు.. ఇంటికే పరిమితమయ్యారు. బొమ్మ చూపించే చిత్ర పరిశ్రమకే.. దారుణమైన బొమ్మ చూపించింది కరోనా మహమ్మారి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల... వైకుంఠపురములో’, ‘భీష్మ’ మూడు చిత్రాలు మంచి హిట్‌ను అందుకున్నాయి. ఒక రకంగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. దీంతో ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు ఢోకా లేదు. ఆరంభమే అద్భుతం అనిపించింది. కానీ ఆ ఆనందం ఆవిరవడానికి రెండు నెలలు కూడా పట్టలేదు. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవడం ప్రారంభమైంది.

భారీ చిత్రాలు మొదలు.. ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ‘వి’, ‘నిశ్శబ్దం’, సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’, ‘పలాస 1978’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ నుంచి ‘జోహార్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కలర్‌ ఫొటో’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’, ‘జోహార్‌’, ‘47 డేస్’, ‘మిస్‌ ఇండియా’, ‘అమరం అఖిలం ప్రేమ’ వంటి పలు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటిలో కొన్ని పెద్ద సినిమాలు బోల్తా పడగా.. ‘ఆకాశమే నీ హద్దురా’ మాత్రం అద్భుతమైన సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక చిన్న సినిమాలంటూ కొట్టిపడేయడానికి లేకుండా అద్భుత విజయం సాధించాయి. అయితే ఈ ఏడాది ఎవరికీ పెద్దగా కలిసిరాలేదు. కానీ ఇండస్ట్రీలో ఒకరు మాత్రం ఈ ఏడాది ప్రారంభంలోనే నక్కతోక తొక్కారేమో అనిపిస్తోంది. ఆయన మరెవరో కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె.

2019 వరకూ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలిసిన రఘు ఈ ఏడాది విలన్‌.. హీరో.. ప్రొడ్యూసర్‌ అవతారాలెత్తారు. ఈయనకు కలిసి వచ్చినంతగా ఈ ఏడాది ఎవరికీ కలిసి రాలేదనే చెప్పాలి. ‘47 డేస్’తో ప్రొడ్యూసర్‌గా మారారు. ఇక ‘పలాస’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయడంతో పాటు నటుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. దీంతో అవకాశాలు ఆయనకు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 7 ప్రాజెక్టులున్నాయి. ఈ ఏడు ప్రాజెక్టుల్లో 4 ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా మూడు సినిమాలను డైరెక్టుగా థియేటర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ అక్టోబర్, నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించుకున్న సినిమాలే కావడం విశేషం. ఈ ఏడు సినిమాలు 2021 ప్రథమార్థంలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.