close
Choose your channels

అజిత్‌కు కలిసొచ్చిన లక్.. ఆదిథ్యకు కొత్త శాఖ!

Monday, December 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అజిత్‌కు కలిసొచ్చిన లక్.. ఆదిథ్యకు కొత్త శాఖ!

ఎవరి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఎవరికెప్పుడు లక్ కలిసొస్తుందో.. ఎప్పుడు సామాన్యుడు సెలబ్రిటీ అవుతాడో ఎవరికీ అర్థంకాదు. ఒక్క మాటలో చెప్పాలంటే జీరో.. హీరో అవ్వొచ్చు.. అంతకుమించి ఇంకేమైనా జరగొచ్చు. ఇందుకు చక్కటి ఉదాహరణ మహారాష్ట్ర రాజకీయాలు అని చెప్పుకోవచ్చు. అసలు సార్వత్రిక ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమికి అన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు.. ఒక వేళ ఊహించినా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు. అయితే.. అటు ఇటూ కాకుండా మెజార్టీ ఎవరకీ రాకపోవడంతో.. ఎన్నో ట్విస్ట్‌లు మరోన్నో నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కి తగ్గడం ఆ తర్వాత నాన్చి.. నాన్చి.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.

అజిత్‌.. అదిత్య కేబినెట్‌లోకి!
అయితే అప్పట్లో ఎన్సీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైమ్‌లో.. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్‌కు ఏ పదవైతే ఉందో శివసేన ప్రభుత్వంలో కూడా అదే పదవి దక్కింది. లక్కంటే అజిత్‌దే అన్న మాట. అప్పుడు.. ఇప్పుడు సేమ్ పదవే. అయితే పట్టుబట్టి మరీ తనకు డిప్యూటీనే కావాలని అజిత్ తీసుకున్నారట. కాగా.. సోమవారం నాడు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి సమక్షంలో డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఎవరూ ఊహించని విధంగా ఆధిత్య ఠాక్రే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో పాటు అశోక్ చవాన్, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కొడుకు కోసం కొత్త శాఖ!
వాస్తవానికి ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారని అందరూ భావించారు కానీ.. ఉద్ధవ్ పీఠాన్ని అధిరోహించారు. అయితే పార్టీలో కీలక పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏకంగా తండ్రి తన కేబినెట్‌లోకే కుమారుడు ఆదిత్యను తీసుకున్నారు. అంతేకాదండోయ్ ఆయన కోసం ప్రత్యేక శాఖను కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి (పీఎంవో) ఉన్నట్లు గానే.. రాష్ట్రంలోనూ సీఎంవో పగ్గాలు చూసుకునేందుకు గాను ‘సీఎంవో మంత్రి’ అని కొత్త పదవిని సృష్టించి కుమారుడ్ని సెట్ చేయాలని ఉద్ధవ్ నిర్ణయించారు.

వాస్తవానికి దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకూ ఈ శాఖ ఎక్కడా లేదు.. పాలనా పరంగా తనదైన మార్క్ చూపించుకోవాలని తహతహలాడుతున్న ఉద్దవ్ వెరైటీ స్టెప్పులేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడి కోసం ప్రత్యేక శాఖను కేటాయించడం.. ఇలా చేస్తే అటు పాలనా పరంగా అనుభవం ఇచ్చినట్లవుతుందని, రాజకీయంగా కుమారుడ్ని తీర్చిదిద్దినట్లు భావించి వ్యూహాత్మకంగానే ముందుడుగులు వేస్తున్నారు ఉద్ధవ్. మరి ఈ కొత్త శాఖ ఏ మాత్రం పనిచేస్తుందో.. ఏ మేరకు పేరు తెచ్చిపెడుతుందో తెలియాలంటే రంగంలోకి దిగినంత వరకూ వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.