close
Choose your channels

Srikanth: రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరో శ్రీకాంత్

Monday, May 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరో శ్రీకాంత్

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని హీరో శ్రీకాంత్ స్పష్టంచేశారు. దీనిపై ఆయ‌న స్వయంగా వివ‌ర‌ణ ఇస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు.. పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు నాకు చాలా మంది ఫోను చేస్తూ వున్నారు. వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్తల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్తలు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం" అని చెప్పారు

"మొన్నమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. ఇలాంటి వార్తలు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా, చాలామంది సామాజిక మాధ్యమాల్లో 'రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్' అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు’’ విజ్ఞప్తి చేశారు.

రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరో శ్రీకాంత్

మరోవైపు సీనియర్ నటి హేమ కూడా ఈ పార్టీలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. "నేను ఎక్కడకీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను.. చిల్ అవుతున్నాను. నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి. అది ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి" అంటూ హేమ కోరారు.

కాగా బెంగుళూరు శివారు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా పార్టీలో తెలుగు సీనీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్లు గుర్తించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.