close
Choose your channels

Ilaiyaraaja:ఇళయరాజా తీవ్ర ఆగ్రహం.. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు

Thursday, May 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇళయరాజా సంగీత ప్రియులకు ఓ వ్యసనం లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలకు సంగీతం ఇచ్చారు. ఇప్పటికి చాలామంది మ్యాస్ట్రో పాటలే వింటూ ఉంటారు. ఎంతో మంది సంగీత దర్శకులు ఆయనను ఆచరిస్తూ ఉంటారు. అభినందిస్తూ ఉంటారు. కానీ అలాంటి దిగ్గజ వ్యక్తి ఇటీవల ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తన పాట ఎవరు ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు. గతంలో ఏకంగా దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలుకి అమెరికా ఈవెంట్స్ లో తన పాటలు వాడారని లీగల్ నోటీసులు పంపారు. దీంతో ఆ వ్యవహారం చాలా సంచలనంగా మారింది.

ఇద్దరు ఎప్పట్నుంచో మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇళయరాజా అందించిన ఎన్నో పాటలను ఎస్పీబీ పాడారు. అలాంటి ఎస్పీ బాలుకే నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటి నుంచి ఏదైనా సినిమాల్లో, వేరే చోట్ల కానీ తన పాటలని, సంగీతాన్ని ఎవరైనా వాడితే వాళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. తన పర్మిషన్ తీసుకోలేదని, తనకు డబ్బులు చెల్లించాలని, తనకి క్రెడిట్స్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే తన పాటలను వాడిన పలు సినిమాలకు నోటీసులు పంపారు.

తాజాగా మలయాళం సూపర్ హిట్ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు పంపించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే.. పాటని వాడారు. మలయాళ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ పాటనే వాడారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన పాట ఎందుకు వాడుకున్నారని.. తనకు నష్టపరిహారం 15 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని నోటీసులు అందించారు. దీంతో మూవీ టీమ్ షాక్ అయింది. వాస్తవంగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా మొదట్లో స్పెషల్ థ్యాంక్స్ అని ఇళయరాజాకు, కమల్ హాసన్‌కు క్రెడిట్స్ కూడా ఇచ్చారు. అయినా కానీ ఇళయరాజా నోటీసులు పంపించడం గమనార్హం. ఇళయరాజా వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాట వాడుకున్నందుకు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి ఇలా లీగల్ నోటీసులు పంపడం ఎంతవరకు సమంజం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.