close
Choose your channels

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలైంది..

Monday, April 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. పుష్ప గాడి మాస్ జాతర మొదలైంది..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‍గా వస్తున్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్‌లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ మాత్రం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. పుష్ప గాడి మాస్ జాతర మొదలైంది..

ఈ టీజర్‌లో తిరుపతి గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మవారిలా ఉగ్రరూపంతో చేస్తున్న ఫైట్‌ అదిరిపోయింది. టీజర్‌లోనే బన్నీ విశ్వరూపం కనపడటంతో సినిమాలో మాస్ జాతరే ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఆ బ్యాక్ డ్రాప్‌లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే దర్శకుడు సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట. మూవీకి ఈ సీక్వెన్స్ హైలైట్ కాబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలు అందించాడట. ఈ జాతర సాంగ్ కూడా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది.

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. పుష్ప గాడి మాస్ జాతర మొదలైంది..

ఇదిలా ఉంటే 'పుష్ప2' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే వైజాగ్‍లో షెడ్యూల్ పూర్తవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుగుతోంది. భారీస్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నారు. వీరితో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. పుష్ప గాడి మాస్ జాతర మొదలైంది..

ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. దీంతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దుబాయ్‌లోని మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని బన్నీ స్వయంగా ఆవిష్కరించారు. 'అలవైకుంఠపురంలో' మూవీలోని కాస్ట్యూమ్‌తో 'పుష్ప' మూవీలోని తగ్గేదేలే మేనరిజంతో ఈ విగ్రహం తయారుచేశారు. కాగా పుష్ప2 తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.