close
Choose your channels

నేనేంటో...నా బలం ఏమిటో తెలుసుకున్నాను ఇక నుంచి నా దృష్టి అంతా దానిపైనే..! - అమలా పాల్

Monday, December 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెజ‌వాడ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...ల‌వ్ ఫెయిల్యూర్, నాయ‌క్, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో...తదిత‌ర చిత్రాల్లో న‌టించి మెప్పించిన అందాల క‌ధానాయిక అమ‌లా పాల్..! డైరెక్ట‌ర్ విజ‌య్ తో భేదాభిప్రాయాలు కార‌ణంగా అమ‌లా పాల్ విడాకులు తీసుకోబోతున్న విష‌యం తెలిసిందే. లైఫ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల వ‌ల‌న సినిమాల‌కు కొంత గ్యాప్ తీసుకుని ఆథ్యాత్మిక ఆలోచ‌న‌ల‌తో హిమాల‌యాల్లో ప్ర‌యాణం చేసిన‌ అమ‌లాపాల్ ఇక నుంచి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా అమ‌లా పాల్ చెప్పిన విశేషాలు మీకోసం...!
క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్..!
క్రిస్మ‌స్ పండ‌గ‌ను ప్ర‌పంచ మొత్తం సెల‌బ్రేట్ చేసుకుంటుంది. నేను ఈసారి క్రిస్మ‌స్ ను కొచ్చిలో ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో సెల‌బ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ ఇయ‌ర్ క్రిస్మ‌స్ టైమ్ కి మా నాన్న‌గారు హాస్ప‌ట‌ల్ లో ఉన్నారు. అందుచేత గ‌త సంవ‌త్స‌రం హాస్ప‌ట‌ల్ లోనే క్రిస్మ‌స్ ను సెల‌బ్రేట్ చేసుకున్నాం. ఈసారి ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రితో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది.
చిన్న‌ప్ప‌టి క్రిస్మ‌స్ జ్ఞాప‌కాలు...!
చిన్న‌ప్పుడు క్రిస్మ‌స్ ను ఓ ప‌ది రోజులు పాటు సెల‌బ్రేట్ చేసుకోనేవాళ్లం. క్రిస్మ‌స్ ట్రీను చాలా బాగా డెక‌రేట్ చేసేవాళ్లం. ఎవ‌రి ఇంటి ద‌గ్గ‌ర క్రిస్మ‌స్ ట్రీ బెస్ట్ గా ఉందో చూసేవాళ్లం. పోటీప‌డి క్రిస్మ‌స్ ట్రీను డెక‌రేట్ చేసేవాళ్లం. మా అమ్మ‌తో క‌లిసి షాపింగ్ కి వెళ్లి క్రిస్మ‌స్ షాపింగ్ చేసేదాన్ని. అలాగే చ‌ర్చికి వెళ్లి ప్రార్ధ‌న చేయ‌డం... క్రిస్మ‌స్ హాలీడేస్ లో వ‌రుస‌గా సినిమాలు చూడ‌డం. చ‌ర్చిలో పాట‌లు పాడ‌డం..ఇవ్వ‌న్నీ ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కాలు.
అమేజింగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు..!
సినిమా షూటింగ్ టైమ్ లో చాలా హ్యాపీగా ఉంటాను. షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. వ‌చ్చే సంవ‌త్స‌రం అమేజింగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తిరుట్టుపాయల్ 2లో ప‌వ‌ర్ ప్యాక్డ్ రోల్ చేస్తున్నాను. వి.ఐ.పి 2 లో ధ‌నుష్ భార్య‌గా న‌టిస్తున్నాను. అలాగే విష్ణుతో ఓ మూవీ చేస్తున్నాను. తొలిసారి క‌న్న‌డ సినిమా కూడా చేయ‌బోతున్నాను. మ‌ళ‌యాళం సినిమా, క్వీన్ రీమేక్ లో కూడా న‌టిస్తున్నాను.
మ‌ర‌చిపోలేని హిమాల‌యాల ప్రయాణం..!
లైఫ్ లో ఎత్తుప‌ల్లాలు చూసాను. ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల వ‌ల‌న మెంట‌ల్లీ చాలా స్ట్రాంగ్ గా మారాను. నేను ఏమిటో తెలుసుకున్నాను. హిమాల‌యాల్లో 110 కిలో మీట‌ర్లు ప్ర‌యాణం చేసాను. ఈ ప్ర‌యాణంలో ఎంతో తెలుసుకున్నాను. 2016లో నేను మ‌ర‌చిపోలేనిది అంటే ఈ హిమాల‌యాల ప్ర‌యాణ‌మే. 2017 సంవ‌త్స‌రంలో సినిమాలు చేస్తూ ఫుల్ హ్యాపీగా ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను.
నా దృష్టి అంతా న‌ట‌న మీదే..!
2017లో నా దృష్టి అంతా న‌ట‌న మీదే. నాకు రాయ‌డం అల‌వాటు. నా లైఫ్ లో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రాస్తుంటాను. అలాగే చిన్ని చిన్న స్టోరీస్ కూడా రాస్తుంటాను. అయితే...క‌థ‌లు రాయాలి, ద‌ర్శ‌క‌త్వం చేయాలి అనే విష‌యాల పై ప్ర‌స్తుతానికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. నా దృష్టి అంతా న‌ట‌న పైనే. కొత్త విష‌యాలు తెలుసుకునేందుకు ఇది స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నాను.
దేనికి గ్యారంటీ లేదు..!
జీవితానికే కాదు దేనికి గ్యారంటీ లేదు అని తెలుసుకున్నాను. అందుచేత ఈరోజు ఎలా ఉన్నాం అనేదే ఆలోచిస్తాను. నేను పెళ్లిచేసుకుంటాను అని, విడాకులు తీసుకుంటాను అని, అస‌లు...ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాను అని అనుకోలేదు జీవితం అంటే అంతే..! ప్ర‌స్తుతం అన్ని లాంగ్వేజ‌స్ లో సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను.
ఆధ్యాత్మిక ఆలోచ‌న‌లే నా బ‌లం..!
ప్ర‌తిరోజు యోగా చేస్తున్నాను. మేడిటేష‌న్ అనేది నాకు ఒక అడిక్ష‌న్ లా అయ్యింది. స్పిరిట్యూవ‌ల్ ఆలోచ‌న‌లే నా బ‌లంగా భావిస్తున్నాను.ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోను, ప్రొఫిషిన‌ల్ లైఫ్ లోను ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనేది తెలుసుకోలేం. నా జీవితంలో అన్నీ త్వ‌ర‌గానే తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఆ దేవుడు ఒక డోర్ క్లోజ్ చేస్తే మ‌రో డోరో ఓపెన్ చేస్తాడు అని న‌మ్ముతాను. అది తెలుసుకుని హ్యాపీగా ఉండాలి అని తెలుసుకున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.