close
Choose your channels

YCP:వైసీపీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట.. సామాజిక న్యాయం అంటే ఇదే..

Saturday, March 16, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. 25 పార్లమెంట్ సీట్లలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11 సీట్లు, ఓసీలకు 9 సీట్లను సీఎం జగన్ కేటాయించారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. 200 ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో 33 ఎస్సీలకు, ఎనిమిది ఎస్టీలకు, 59 బీసీలకు, 7 మైనార్టీలకు, ఓసీలకు 100 సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించారు.

దేశంలోనే 50శాతంకు పైగా సీట్లు వెనకబడిన వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా మహిళలకు, బీసీలకు ఈ జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడంలో వైసీపీని మించిన పార్టీ మరొకటి లేదని నిరూపించారు. అలాగే 14 మంది పార్టీ కార్యకర్తలకు అసెంబ్లీ స్థానాలను కేటాయించి క్యాడర్‌కు అభయం కల్పించారు. 2019 లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయించగా.ఈ సారి ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు వారికి కేటాయించారు.

2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించగా.. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా ఈసారి మరో 4 స్థానాలు పెంచి 19 స్థానాలు ఇచ్చారు. 2019లో ఐదుగురు మైనార్టీలకు ఇవ్వగా ఈసారి మరో రెండు సీట్లు పెంచి మొత్తం 7 స్థానాలు కేటాయించారరు. ఇక 2019లో మహిళలకు 2 ఎంపీ స్థానాలు ఇస్తే ఈసారి 3 స్థానాలు ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది గ్రాడ్యుయేట్లు, ఎంపీల్లో 88 శాతం మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు.

మరోవైపు కూటమి తరుఫున బరిలో దిగుతున్న కీలక నేతలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ తనదైన వ్యూహాలు అమలు చేశారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాల్లో మహిళలను పోటీకి నిలబెట్టారు. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను అభ్యర్థిగా ప్రకటించగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలిపారు. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.