close
Choose your channels

పూర్తీ ఫాంటసీ కామెడీ చిత్రంలో హీరోయిన్  అంజలి

Thursday, July 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూర్తీ ఫాంటసీ కామెడీ చిత్రంలో హీరోయిన్  అంజలి

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు మన అంజలి సరికొత్త సినిమా తో పూర్తీ కామెడీ సినిమా తో మన ముందుకు వస్తుంది. కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం లో బెల్లూన్ సినిమా దర్శకుడు కె ఎస్ సినీష్ నిర్మాతగా ది సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మించబడుతుంది.

ఈ సందర్బంగా నిర్మాత కె ఎస్ సినీష్ మాట్లాడుతూ " మాములుగా మహిళాలు ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు అయితే థ్రిల్లర్ గా లేక హారర్ సినిమాలు గా నిర్మించబడ్డాయి కానీ మా సినిమా పూర్తీ ఫాంటసీ కామెడీ. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ రచించినా ఈ కథ నాకు చాల బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేదాం అని డిసైడ్ అయ్యాను. అంజలి గారితో నేను బెల్లూన్ సినిమా దర్శకత్వం చేశాను. తాను అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని తనకు కథ ను వివరించాము. అంజలి గారు కూడా కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలో నిర్మించబడుతుంది ".

దర్శకుడు కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ " అంజలి గారికి ఈ కథ నచ్చితుందో లేదు అని అనుకున్నాం కానీ తనకి కథ చాపగానే చాలా బాగుంది నేను చేస్తున్నాను అని చాపగానే మాకు చాల సంతోషం వేసింది. ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. చాలా కొత్త ఉంటుంది" అని తెలిపారు.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, కథలో రాజకుమారి, పడి పడి లేచే మనసు సినిమాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. రాజా రాణి, అదిరింది , కర్తవ్యం విశ్వాసం లాంటి బారి బ్లాక్ బస్టర్ సినిమా లో ఎడిటర్ గా పని చేసిన రూబెన్ ఈ సినిమా ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సాహి లాంటి బారి బడ్జెట్ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ సుబ్బరామన్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫేర్ గా ఉన్నారు. శక్తీ వెంకటరాజ్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. కథ దర్శకత్వం కృష్ణన్ జయరాజ్ మరియు నిర్మాత కె ఎస్ సినీష్.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.