ఎన్టీఆర్ బయోపిక్‌లో మరో దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితకథను `యన్.టి.ఆర్` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సుమంత్ సహా స్టార్ తారాగణం చాలా మంది నటిస్తున్నారు. కాగా ఈ లిస్టులో కథ ప్రకారం దర్శకుడు విఠలాచార్య పాత్రను కూడా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు క్రిష్.
వివరాల ప్రకారం ఒకప్పుడు దెయ్యాల కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు బి.విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ నటిస్తున్నారట. కొన్ని సన్నివేశాలను శంకర్‌పై చిత్రీకరించారు కూడా. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుండగా.. సినిమా జనవరి 9న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.