close
Choose your channels

క‌పిల్‌దేవ్‌లో శ్రీకాంత్‌గా జీవా!

Friday, January 4, 2019 • తెలుగు Comments

క‌పిల్‌దేవ్‌లో శ్రీకాంత్‌గా జీవా!

మన దేశానికి తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్పును అందించింది కపిల్‌దేవ్. ఈయన నాయకత్వంలో 1983లో ఎలాంటి అంచనాలు లేని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. కాగా ఇప్పుడు కపిల్ బయోపిక్‌ను తెరకెక్కించన్నారు. `ఏక్‌థా టైగర్` ఫేమ్ కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి కపిల్ డెవిల్స్‌గా ఎవరు కనపడతారనేది ఆసక్తికరంగా మారింది.

కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటిస్తుండగా.. ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తెలుగు హీరో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి హీరోల పేర్లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం త‌మిళ న‌టుడు జీవా వెట‌ర‌న్ క్రికెట‌ర్ శ్రీకాంత్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. అందుకోసం కృష్ణ‌మాచారి ఆధ్వ‌ర్యంలోనే జీవా ప్ర‌తిరోజూ రెండు గంట‌ల పాటు శిక్ష‌ణ తీసుకుంటున్నాడట‌. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫాంట‌మ్ ఫిలింస్‌, విబ్రి మీడియా బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz