close
Choose your channels

Anupama Parameswaran : స్కర్ట్‌కు ముడివేసి, నడుము చూపిస్తూ... పిచ్చేక్కిస్తోన్న అనుపమ

Tuesday, November 29, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు సినిమాపై చాలా మంది మలయాళ బ్యూటీలు సందడి చేశారు. మధ్యలో ముంబై భామలు దండయాత్ర చేసినా మలయాళీ అందాలను మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. ఇటీవల కేరళ ముద్దుగుమ్మల తాకిడి మళ్లీ పెరిగింది. ఇలాంటి వారిలో ఒకరు అనుపమా పరమేశ్వరన్. ప్రేమమ్ మూవీ సూపర్‌హిట్ కావడంతో ఆ దెబ్బకు సౌత్‌లో అనుపమ పేరు మారుమోగిపోయింది. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వెల్లువలా పోటెత్తాయి.

ప్రేమమ్‌తో సౌత్‌లో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ:

త్రివిక్రమ్ నితిన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘‘అ ఆ’’లో పదహారు అణాల తెలుగమ్మాయిలా సందడి చేశారు అనుపమ. తర్వాత ‘శతమానం భవతి’’, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించింది. అయితే మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో అనుపమ పనైపోయిందని సినీ జనాలు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో నిఖిల్‌ సరసన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘కార్తికేయ 2’’ సంచలన విజయం సాధించడంతో అనుపమకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ వెంటనే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమాలో అనుపమను హీరోయిన్‌గా ఎంపికైనట్లుగా ప్రచారం జరిగింది. తర్వాత డీజే టిల్లుకు సీక్వెల్‌లోనూ ఆమె నటిస్తున్నారు.

హాట్ ఫోటో షూట్‌లతో అనుపమ సందడి:

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, షూటింగ్ వివరాలను అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతూ వుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చుక్కల కర్లీ హెయిర్‌తో ... స్కర్ట్‌కు ముడివేసి నడుము చూపిస్తూ రెచ్చిపోయింది ఈ కేరళ ముద్దుగుమ్మ. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment