close
Choose your channels

కత్తి పట్టుకుని రికార్డ్ ల మీదకు బాలయ్య దండయాత్ర..!

Saturday, October 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యానర్ పై బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టిస్తుంది. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రంలోని బాల‌య్య న్యూస్టిల్ ను ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది.
బాల‌య్య క‌త్తి ప‌ట్టుకుని త‌న‌దైన శైలిలో నిలుచున్న ఈ న్యూ స్టిల్ చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో హిస్ట‌రీ రీపీట్ అవ్వ‌డం ఖాయం అని కొంత మంది అభిమానులు సోష‌ల్ మీడియాలో అంటుంటే...బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు క‌త్తి ప‌ట్టుకుని రికార్డ్ ల మీద‌కు దండ‌యాత్ర అంటూ బాల‌య్య న్యూస్టిల్ పై స్పందించ‌డం విశేషం. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.