'క‌థానాయ‌కుడు' న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి

  • IndiaGlitz, [Thursday,February 14 2019]

నందమూరి బాల‌కృష్ణ త‌న తండ్రి, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక్రాంతికి తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' విడుద‌లైంది. ఇది పెద్దగా స‌క్సెస్ కాలేదు. విడుద‌ల‌కు ముందు ఉన్న క్రేజ్‌తో బ‌య్య‌ర్లు సినిమాను భారీ రేట్లు పెట్టి కొన్నారు. అయితే సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి న‌ష్టాల్నే మిగిల్చింది. ఇలాంటి త‌రుణంలో ఈ సినిమా రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు'ని విడుద‌ల చేయ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్స్ స‌త‌మ‌త‌మైయ్యారు.

ఓద‌ధ‌శ‌లో క‌థానాయ‌కుడు కొని న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు మ‌హానాయ‌కుడు ఫ్రీ అని కూడా అన్నారు. అయితే త‌ర్వాత లెక్క‌లు మారాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్ట‌పోకుండా ఉండ‌టానికి బాల‌య్య స్వ‌యంగా రంగంలోకి దిగారు. క‌థానాయ‌కుడు కొన్న‌వారికి న‌ష్టాల్లో మూడో వంతు ఇచ్చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అలాగే మ‌హానాయ‌కుడు చిత్రాన్ని అదే కోనుగోలు దారుల‌కు అప్ప‌గించారు. ఈ సినిమా లాభాల్లో 40 శాతం డిస్ట్రిబ్యూట‌ర్స్‌కే ఇస్తామ‌ని కూడా తెలియ‌జేశారు. 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చిత్రాన్ని ఈ నెల 22న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

పార్టీ మారడానికి సిద్ధమైన టీడీపీ ఎంపీ!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. రోజురోజుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు.

జయరామ్ హత్యకేసు: శిఖాకు ఊహించని వ్యక్తి మద్దతు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో ఎన్నారై చిగురుపాటి జయరామ్ ‌‌హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడో,రేపో ఎన్నికల కోడ్ మొదలవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరుబాట పట్టారు.

జగన్ సంచలన నిర్ణయం.. షర్మిళకు కీలక బాధ్యతలు!

వైఎస్ షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో పదిరోజుల్లో ఆమెకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారా..?

పాతిక కేజీల బియ్యంకాదు.. పాతికేళ్ల భవిష్యత్తే నా లక్ష్యం!

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలువురు మేథావులు, ప్రముఖులు,