close
Choose your channels

బ్ర‌హ్మోత్స‌వం రిజ‌ల్ట్ కి కార‌ణం ఇదే..

Tuesday, May 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే భారీ అంచ‌నాల ఏర్ప‌రుచుకున్న బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది. బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డం వెన‌క ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అది ఏమిటంటే...మ‌హేష్ బాబు త‌న‌కు స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అయితే మ‌హేష్ తో రెండోసారి సినిమా తీసిన ద‌ర్శ‌కులు మాత్రం మ‌హేష్ కి స‌క్సెస్ కి బ‌దులు ఫ్లాప్ తో షాక్ ఇచ్చారు.

మ‌హేష్ తో ఫ‌స్ట్ టైమ్ స‌క్సెస్ ఇచ్చి ఆత‌ర్వాత ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్. మ‌హేష్ బాబుతో గుణ‌శేఖ‌ర్ ఒక్క‌డు అనే సూప‌ర్ హిట్ మూవీ తెర‌కెక్కించారు. ఆత‌ర్వాత మ‌హేష్ - గుణ శేఖ‌ర్ చేసిన అర్జున్, సైనికుడు.. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. అలాగే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో మ‌హేష్ చేసిన మొద‌టి చిత్రం అత‌డు. ఈ చిత్రం మ‌హేష్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిల‌చింది. ఆత‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి చేసిన ఖ‌లేజా ఫ్లాప్ అయ్యింది. మ‌హేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం దూకుడు. ఈ చిత్రం బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచింది. ఆత‌ర్వాత మ‌హేష్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్లో రూపొందిన ఆగ‌డు ఫ్లాప్ అయ్యింది.

మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందిన తొలి చిత్రం సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. శ్రీకాంత్ అడ్డాల‌తో మ‌హేష్ చేసిన రెండో బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ సెంటిమెంటే బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డానికి కార‌ణం అనేది కొంత మంది వాద‌న‌. అయితే...ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మ‌హేష్ తో చేసిన పోకిరి, బిజినెస్ మేన్ ఈ రెండు చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఒకే ఒక్క డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు - పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి హ్యాట్రిక్ ఫిల్మ్ జ‌న‌గ‌ణ‌మ‌న‌ చేయ‌నున్నారు. ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.