close
Choose your channels

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

Monday, May 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన కొడంగల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆయనతో పాటు కుటుంబసభ్యులు ఓటు వేశారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో ఆయనతో పాటు సతీమణి శోభ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సందర్భంలో ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

అలాగే కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్ నంది నగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు హిమాన్ష్ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బర్కత్‌పూరాలో ఓటు వేశారు. అటు ఏపీలో సీఎం జగన్ దంపతులు పులివెందులలో భాకరాపురంలో ఓటు వేశారు. చంద్రబాబు దంపతులు, లోకేష్‌ దంపతులు మంగళగిరిలో ఓటు వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దంపతులు కూడా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ హిందూపురంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

ఇక సినీ నటుల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి దంపతులు జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌లో మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, నమ్రత, ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్‌లో అల్లు అర్జున్ దంపతులు, మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, మంచు విష్ణు, లక్ష్మి, మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయ్ దేవరకొండ, ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవరకొండ ఓటు వేశారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ లో జీవిత, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దగ్గుబాటి రానా, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు ఓటు వేశారు.

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ , వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమ, ఓటు వేశారు. దర్శకుడు రాఘవేంద్ర రావు, హీరో శ్రీకాంత్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. దర్శకుడు గోపిచంద్ ఏపీలోని బడ్లూరివారి పాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.