close
Choose your channels

నెక్ట్స్ టైమ్ అలా జ‌ర‌గ‌కుండా చూస్తానంటున్న చ‌ర‌ణ్‌..!

Thursday, August 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లును ఎక్క‌డెక్క‌డి నుంచో హైద‌రాబాద్ వ‌చ్చి అభిమానులు శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే...అభిమానులు నిర్వ‌హించిన వేడుక‌కు చిరంజీవి హాజ‌రు కాకుండా సినీ ప్ర‌ముఖుల కోసం ఏర్పాటు చేసిన బ‌ర్త్ డే పార్టీకి చిరంజీవి హాజ‌రు కావ‌డం పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే...మెగాస్టార్ సినీ ప్ర‌ముఖుల‌కు ఇచ్చిన బ‌ర్త్ డే పార్టీకి క‌వ‌రేజ్ కోసం అంటూ మీడియాను పార్టీ జ‌రిగే పార్క్ హ‌య‌త్ లోప‌ల‌కు రానివ్వ‌కుండా గేటు వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. గేటు ద‌గ్గ‌ర నిల‌బ‌డి క‌వ‌రేజ్ చేయ‌డానికి కెమెరామెన్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. రాత్రి 9 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఈ పార్టీ జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు మీడియా ప్ర‌తినిధులు తాగ‌డానికి మంచి నీరు లేక చాలా ఇబ్బందులు ప‌డ్డారు. అర్ధ‌రాత్రి 12 టైమ్ లో మీడియా ప్ర‌తినిధులు గుర్తుకురావ‌డంతో...అప్ప‌టిక‌ప్పుడు వేరే హాట‌ల్ నుంచి బిర్యానీ పేకెట్స్, మంచి నీళ్లు తీసువ‌చ్చి వ‌ర‌ద బాధితుల‌కు ఇచ్చిన‌ట్టుగా ఆహార పొట్లాలు పంపిణీ చేసారు.

అభిమానులు చేసిన ఫంక్ష‌న్ కి చిరంజీవి రాక‌పోవ‌డం....సెల‌బ్రిటీస్ కి ఇచ్చిన పార్టీకి మీడియాను పిలిచి గౌర‌వించిన విధానం పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో రామ్ చ‌ర‌ణ్ రంగంలోకి దిగి నాన్న‌గారి పుట్టిన‌రోజు నాడు చాలా ఈవెంట్స్ చేయ‌డం వ‌ల‌న మీడియా ప్ర‌తినిధుల‌కు త‌గిన విధంగా సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌లేక‌పోయాం. నెక్ట్స్ టైమ్ ఇలా జ‌ర‌గ‌కుండా నేను అలాగే మా టీమ్ ప‌క్కాగా ప్లాన్ చేస్తాం. ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్న మీడియా ప్ర‌తినిధులుకు థ్యాంక్స్ అంటూ స్పందించాడు.

ప‌ర్స‌న‌ల్ గా సెల‌బ్రేట్ చేసుకునే బ‌ర్త్ డే పార్టీకి క‌వ‌రేజ్ కోసం అంటూ మీడియాను పిల‌వ‌డం ఎందుకూ...? ఒకవేళ మీడియాను పిల‌వాలి అనుకుంటే లోప‌ల‌కు కూడా అనుమ‌తించాలి. అలా కాకుండా...గేటు వ‌ర‌కే మీకు అనుమ‌తి అన‌డం చాలా దారుణం..! అంతా అయిపోయిన త‌ర్వాత విమ‌ర్శ‌లు వ‌స్తే...ఇలా జ‌రుగుతుంది అనుకోలేదు...నెక్ట్స్ టైమ్ ఇలా జ‌ర‌గ‌కుండా చూస్తాం..అన‌డం..! విని విని బోర్ కొట్టింది..! మారండి....మ‌నిషిని మ‌నిషిగా చూడండి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.